చంద్రయాన్ 2: రాజకీయ ప్రముఖులు ఏమన్నారంటే..

చంద్రయాన్ 2: రాజకీయ ప్రముఖులు ఏమన్నారంటే..
x
Highlights

ఇస్త్రో శాస్త్రవేత్తల్లో మ‌నోధైర్యాన్ని నింపుతూ ట్వీట్లు చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్ర మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఆయా రాష్ర్టాల సీఎంలు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.

ఇస్త్రో శాస్త్రవేత్తల్లో మ‌నోధైర్యాన్ని నింపుతూ ట్వీట్లు చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్ర మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఆయా రాష్ర్టాల సీఎంలు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. చంద్రయాన్-2 కోసం ఇస్రో బృందం అద్భుతమైన పని తీరు కనబరిచారని..అంకిత భావంతో కృషి చేశారని రాష్ర్టపతి రాంనాథ్ కోవింద్ కొనియాడారు. భవిష్యత్ లో సంపూర్ణ విజయం సాధిస్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. జీవితంలో ప్రతి ప్రక్రియలో జయాపజయాలు సాధారణమని..ఇస్రో శాస్త్రవేత్తలు సాధించింది తక్కువేమి కాదని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. భవిష్యత్ పై అశావాహ ధృక్పదంతో ముందుకు సాగుదామన్నారు.. భవిష్యత్తులో విజయాన్ని అందుకుంటారన్న విశ్వాసం ఉందని.. దేశం మొత్తం మీ వెంటే ఉందని.. మిమ్ముల్ని చూసి దేశం గర్విస్తుందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

చంద్రయన్-2 కోసం ఇస్రో బృందం పడిన కష్టం..నిబద్ధత చూసి దేశం మొత్తం మీ వైపు నిలిచిందని..భవిష్యత్ ప్రయోగాల కోసం బెస్ట్ విషెస్ చెబుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. జీవితంలో ఎత్తు పల్లాలు సహజం.. ధైర్యంగా ఉంటాలని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరిలోనూ అంతరిక్ష అవగాహన పెంచారని.. శాస్త్రవేత్తలకు అడ్డగా ఉంటామని తెలియచేశారు. ఇస్రో బృందం మెరుగైన పనితీరు కనబరిచిందని.. శాస్త్రవేత్తల క‌ఠోర శ్ర‌మ‌, ప‌ట్టుద‌ల దేశం గ‌ర్వ‌ప‌డేలా చేశాయ‌న్నారు రాహుల్ తెలిపారు. ప్రతి భారతీయుడికి స్పూర్తి నిస్తుందన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories