Varanasi: వారణాసి లో పోలీస్ డ్రెస్ కోడ్.. ధోతీ, కుర్తా, రుద్రాక్ష మాలలో పోలీసులు

Police In Dhoti Kurta Rudraksha Mala In Varanasi
x

Varanasi: వారణాసి లో పోలీస్ డ్రెస్ కోడ్.. ధోతీ, కుర్తా, రుద్రాక్ష మాలలో పోలీసులు

Highlights

Varanasi: కాశీవిశ్వనాథుని ఆలయంలో పోలీసులకు కొత్త యూనిఫాం

Varanasi: ఉత్తరప్రదేశ్ వారణాసిలో పోలీస్ డ్రెస్ కోడ్ మారింది. కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో పోలీసు సిబ్బంది యూనిఫారానికి బదులు పూజారులు ధరించే దుస్తులు ధరిస్తున్నారు. మహిళా పోలీసులు సల్వార్ కుర్తాలో కనిపిస్తున్నారు. అసలు కాశీ విశ్వనాథ ఆలయంలో అర్చకుల వేషధారణలో పోలీసులు విధులు నిర్వహించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది.. డ్రెస్ కోడ్ ఎందుకు మార్చారు తెలుసుకుందాం..

వారణాసిలోని కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో డ్యూటీ చేసే పోలీసుల కోసం యోగీ సర్కార్ కొత్త డ్రెస్ కోడ్ తీసుకు వచ్చింది. ఖాకీ యూనిఫాంలో కాకుండా అర్చకుల మాదిరి ధోతీ, కుర్తా, నుదుట నామాలు, మెడలో రుద్రాక్ష మాల ధరించాలని ఆదేశించింది. మహిళా పోలీసులు అయితే సల్వార్ కుర్తాలో విధులకు హాజరు కావాలని సూచించింది. సంప్రదాయ వస్త్రధారణలో డ్యూటీ చేయాలని ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. భక్తుల్లో ఒకరిలా.. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు శాఖ వెల్లడించింది. వీఐపీలు ఆలయానికి వచ్చినప్పుడు భక్తులను అదుపు చేసేందుకే ఈ విధానం తీసుకు వచ్చినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. యోగి సర్కార్ ప్రవేశపెట్టిన డ్రెస్ కోడ్ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు అర్చకుల మాదిరి డ్రెస్ కోడ్ ధరించాలని ఏ పోలీసు మ్యానువల్ లో ఉందని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. ఈ ఉత్తర్వులు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ డ్రెస్​ కోడ్​ను అవకాశంగా తీసుకుని కొందరు మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories