Narendra Modi: కర్ణాటకలో ప్రధాని మోడీ పర్యటన

PM Narendra Modis Visit To Karnataka
x

Narendra Modi: కర్ణాటకలో ప్రధాని మోడీ పర్యటన

Highlights

Narendra Modi: బందీపూర్‌ నేషనల్‌ పార్క్‌ను సందర్శించిన మోడీ

Narendra Modi: ప్రధాని మోడీ.. కర్ణాటకలో పర్యటిస్తున్నారు. అయితే, దేశంలో ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవం సందర్బంగా కర్ణాటకలోని బందీపూర్‌ నేషనల్‌ పార్క్‌ను సందర్శించారు. ఆయన టైగర్ సఫారీ కోసం ఓపెన్ టాప్ జీపులో ప్రయణించారు. టైగర్‌ రిజర్వ్‌లో దాదాపు 20 కిలోమీటర్లు దూరం ప్రయాణించారు. పులుల ఆవాసాలు, ఏనుగుల శిబిరాలను సందర్శించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ స్పోర్ట్స్ డ్రెస్‌లో మెరిశారు. సాధారణంగా లాల్చీ కుర్తా, వాస్‌కోట్‌లో కనిపించే ప్రధాని...ఈసారి పూర్తిగా వేషధారణ మార్చేశారు. ఖాకీ ప్యాంట్‌, బ్లాక్ హ్యాట్, ఆర్మీ కలర్ టీ షర్ట్ ధరించారు. ఇవాళ దేశంలోని పులుల సంఖ్యను ప్రధాని ప్రకటిస్తారు. 2022 లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలో 2 వేల967 పులులు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories