ఢిల్లీ తీర్పు : కేజ్రీవాల్‌కు అభినందనల వెల్లువ

ఢిల్లీ తీర్పు :  కేజ్రీవాల్‌కు అభినందనల వెల్లువ
x
PM Modi wished Arvind Kejriwal File Photo
Highlights

ఢిల్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందుకున్న ఆప్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆంద్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, కేరళ ముఖ్యమంత్రులతో పలువురు నేతలు...

ఢిల్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందుకున్న ఆప్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆంద్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, కేరళ ముఖ్యమంత్రులతో పలువురు నేతలు కేజ్రీవాల్‌ కు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అరవింద్‌ కేజ్రీవాల్‌కి శుభాకంక్షలు. అంటూ మోదీ ట్వీట్‌ చేశారు. రాహుల్ గాంధీ కూడా శుభాకాక్షలు తెలిపారు. కేజ్రీవాల్‌ కు తన ప్రత్యేక అభినందనలు అంటూ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు.

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వార్ వన్ సైడ్ సాగింది. ఎగ్జిట్ పోల్స్ లెక్కలకి వించి అమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం సాధించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 62 అమ్ ఆద్మీ స్థానాల్లోనే విజయం సాధించింది. బీజేపీ 8 స్థానాలతోనే సరిపెట్టుకుంది. కాంగ్రెస్‌ ఈ సారి కూడా ఘోర పరాజయం చవిచూసింది. కాగా.. వరసగా మూడో సారి సీఎంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎన్నికైయ్యారు.

కాగా.. 2015లో అమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాల్లో జయకేతనం ఎగురవేయగా.., బీజేపీ 3 సీట్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇక తాజా ఎన్నికల్లో అమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 5 స్థానాలను చేజార్చుకోగా.. బీజేపీ మరో 5 స్థానాలను తన ఖాతాలో వేసుకోగలిగింది. 2015 ఎన్నికలతో పోలిస్తే ఈ ఫలితాల్లో ఎలాంటి మార్పు లేదు.

విజయం అనంతరం ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) అధినేత కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక సీఎం కేజ్రీవాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతల , ఇది ఢిల్లీ ప్రజలు విజయం. అభివృద్దికే ప్రజలు పట్టం కట్టారు. ఈ విజయం నూతన రాజకీయాలకు నాంది పలుకుతుంది. ఢిల్లీ తన కుమారుడిని మరోసారి నమ్మింది అంటూ ప్రకటనలో తెలిపారు.

కేజ్రీవాల్ ను ఓడించేందుకు బీజేపీ సర్వశక్తుల ప్రయత్నాలు చేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏడూ పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్న బీజేపీ ఎలా అయిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని విశ్వప్రయత్నాలు చేసింది. మోడీ, అమిత్ షా, బీజేపీ మంత్రులు ప్రచారం చేసినప్పటికీ ఢిల్లీ ఓటర్లు మాత్రం మళ్ళీ కేజ్రీవాల్ కే పట్టం కట్టారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories