ప్రధాని గుజరాత్ టూర్‎లో ఆసక్తికర పరిణామం.. తాను కాన్వాయ్ ఆపి ఆంబులెన్స్ కు దారిచ్చిన ప్రధానిమోదీ

*అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్ వెళ్తుండగా ఘటన

Rama Rao
Updated on: 30 Sept 2022 9:00 PM IST
PM Narendra Modi Stops Convoy to Make Way for an Ambulance in Gujarat
X

ప్రధాని గుజరాత్ టూర్‎లో ఆసక్తికర పరిణామం.. తాను కాన్వాయ్ ఆపి ఆంబులెన్స్ కు దారిచ్చిన ప్రధానిమోదీ

PM Narendra Modi: ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌లో ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. ప్ర‌ధాని వెళుతున్న మార్గంలో ఆయ‌న కాన్వాయ్ వెనుక ఓ అంబులెన్స్ వ‌స్తుండ‌గా... దానిని గ‌మ‌నించిన ప్ర‌ధాని త‌న కాన్వాయ్‌ను రోడ్డుపైనే నిలిపివేయించి అంబులెన్స్‌కు దారి ఇచ్చారు. అంబులెన్స్ త‌న కాన్వాయ్‌ను దాటిన త‌ర్వాత మోదీ త‌న కాన్వాయ్‌ను ముందుకు కదిలించారు. గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఢిల్లీ నుంచి తొలుత అహ్మ‌దాబాద్ చేరుకున్న మోదీ అహ్మ‌దాబాద్ నుంచి రోడ్డు మార్గం మీదుగా గాంధీ న‌గ‌ర్‌కు బ‌య‌లుదేరారు. అలా కొంత‌దూరం వెళ్ల‌గానే... త‌న కాన్వాయ్ వెనుకాల అంబులెన్స్ వ‌స్తున్న విషయాన్ని గుర్తించిన మోదీ త‌న కాన్వాయ్‌ను రోడ్డుకు ఎడ‌మ ప‌క్క‌గా ఆపించి అంబులెన్స్‌కు దారి ఇచ్చారు.

Rama Rao

Rama Rao

Next Story