logo
జాతీయం

నేను ప్రధానిగా రాలేదు.. మీ కుటుంబసభ్యుడిగా వచ్చాను: ప్రధాని

PM Narendra Modi Speech at Diwali Celebrations in Jammu Kashmir | National News
X

నేను ప్రధానిగా రాలేదు.. మీ కుటుంబసభ్యుడిగా వచ్చాను : ప్రధాని

Highlights

Narendra Modi: సైన్యం కోసం 130 కోట్ల మంది ఆశీస్సులు తీసుకొచ్చాను: ప్రధాని

Narendra Modi: సైన్యం ధైర్య సాహసాలు దీపావళికి మరింత శోభ తెచ్చాయని ప్రధాని మోడీ అన్నారు. జవాన్లతో కలిసి దీపావళి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లో జవాన్లతో కలిసి ప్రధాని మోడీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. తాను ప్రధానిగా రాలేదని.. మీ కుటుంబసభ్యుడిగా వచ్చానన్నారు.

సైన్యం కోసం 130కోట్ల మంది ఆశీస్సులు తీసుకొచ్చానని తెలిపారు. ప్రతి దీపావళిని సైనికులతోనే జరుపుకుంటున్నానని, ప్రతికూల పరిస్థితుల్లో సైనికులు రక్షణగా నిలుస్తున్నారని అన్నారు. సర్జికల్ స్ట్రయిక్స్‌లో సైన్యం పాత్ర దేశానికే గర్వకారణమన్న మోడీ.. సైన్యంలోనూ మహిళలకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు.

Web TitlePM Narendra Modi Speech at Diwali Celebrations in Jammu Kashmir | National News
Next Story