నిర్భయ దోషుల ఉరిశిక్ష పై ప్రధాని మోడీ స్పందన

నిర్భయ దోషుల ఉరిశిక్ష పై ప్రధాని మోడీ స్పందన
x
PM Narendra Modi (File Photo)
Highlights

నిర్భయ కేసులో నిందితులైన అక్షయ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్‌ సింగ్‌లను నలుగురిని ఈరోజు తీహార్ జైలులో ఉరి తీసిన సంగతి తెలిసిందే.

నిర్భయ కేసులో నిందితులైన అక్షయ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్‌ సింగ్‌లను నలుగురిని ఈరోజు తీహార్ జైలులో ఉరి తీసిన సంగతి తెలిసిందే. ఉదయం 5.30 గంటలకు ఢిల్లీలోని తీహార్ జైలు నెంబర్ 3లో ఈ నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు. శిక్ష ఆలస్యమైనా అన్యాయం జరిగిందని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ ప్రధాని మోడీ దీనిపైన స్పందించారు.

మోడీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..న్యాయం జరిగిందని, మహిళల భద్రత, గౌరవాన్ని కాపాడటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. మన నరి శక్తి ప్రతి రంగంలోనూ రాణిస్తోంది మనమంతా కలిసి, మహిళా సాధికారతపై దృష్టి కేంద్రీకరించే దేశాన్ని మనం నిర్మించాలి, ఇక్కడ సమానత్వం మరియు అవకాశాలకు ప్రాధాన్యత ఉంటుందనీ మోడీ పేర్కొన్నారు..

సమయం తేదీ మారవచ్చు కాని తప్పు చేసిన నిందితులకు మాత్రం శిక్ష అనుభవించక తప్పదని జాతీయ మహిళా చైర్ పర్సన్ రేఖ శర్మ పేర్కొన్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్న ఈ కేసులో నిందితులకు ఈరోజు శిక్ష పడింది. దీనితో తీహార్ జైలు బయట సంబరాలు నెలకొన్నాయి. మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.

నిర్భయ తల్లిదండ్రుల ఆనందం :

ఇక నిందితులను ఉరి తీయడంపై నిర్భయ తల్లిదండ్రులు ఆశాదేవీ, భద్రినాథ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు తన కుమార్తెకు న్యాయం జరిగిందని అభిప్రాయపడ్డారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ న్యాయం వైపే కోర్టులు నిలబడ్డాయని, ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం జరగాలని న్యాయపోరాటం చేస్తానని నిర్భయ తల్లి వెల్లడించారు. ఇక నుంచి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది తండ్రి భద్రినాథ్ సింగ్ వెల్లడించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories