లుంబినీలో మోదీ.. ఇరు దేశాల మధ్య ఆరు ఒప్పందాలపై సంతకాలు...

PM Narendra Modi Nepal Tour Highlights | Live News Today
x

లుంబినీలో మోదీ.. ఇరు దేశాల మధ్య ఆరు ఒప్పందాలపై సంతకాలు...

Highlights

Narendra Modi: నేపాల్‌తో భారత్‌ సంబంధాలు బలోపేతమవుతుందన్న మోదీ మాయాదేవిని దర్శించుకోవడం అదృష్టమని వెల్లడి...

Narendra Modi: ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో భారత్‌, నేపాల్‌ స్నేహబంధం మరింత బలపడుతుందని, అది మానవాళికి మేలు చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. భారత్‌లో రామాలయం నిర్మిస్తున్న సందర్భంగా నేపాల్‌ ప్రజలు కూడా ఎంతో సంతోషించారని తనకు తెలుసని ప్రధాని అన్నారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా మాయా దేవి ఆలయంలో ప్రార్థనలు చేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు.

బుద్ధ భగవానుడు మనందరినీ ఆశీర్వదిస్తాడని.. ప్రధాని నేపాల్‌ పర్యటనకు ముందు ట్వీట్ చేశారు. ఒక్క రోజు నేపాల్‌ పర్యటనలో బుద్దుడి జన్మస్థలం లుంబినీని సందర్శించారు. నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌తో కలిసి.. మాయా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అశోక స్తంభం వద్ద ప్రత్యేక దీపాలు వెలిగించారు. క్రీస్తుపూర్వం 249లో అశోక చక్రవర్తి ప్రతిష్ఠించిన చారిత్రక స్తంభం అది. అనంతరం మోదీ మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి కృషి చేస్తామని మోదీ స్పష్టం చేశారు.

సాంస్కృతిక, విద్యా రంగాల్లో పరస్పర సహకారంపై ఇరు దేశాల మధ్య ఆరు ఒప్పందాలు కుదరిరాయి. నేపాల్‌లో లుంబినీ మ్యూజియం నిర్మాణం, లుంబినీ బౌద్ధ విశ్వవిద్యాలయంలో బౌద్ధ అధ్యయనాల కోసం డాక్టర్ అంబేద్కర్ పీఠాన్ని ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి. 2014 తరువాత ప్రధాని మోదీ నేపాల్‌కు వెళ్లడం ఇది ఐదోసారి. ఇరు దేశాల సరిహద్దుల్లోని కాలాపానీ వంటి ప్రదేశాలు తమవని గత ప్రధాని కేపీ ఓలీ వివాదాని తెరలేపారు. ఈ వివాదం తరువాత ప్రధాని మోదీ నేపాల్‌ వెళ్లడం ఇదే తొలిసారి.

Show Full Article
Print Article
Next Story
More Stories