ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌ను ప్రారంభించిన మోడీ

ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌ను ప్రారంభించిన మోడీ
x
Highlights

ఒడిశాలోని కటక్‌ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌ 2020ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌...

ఒడిశాలోని కటక్‌ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌ 2020ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా క్రీడా పోటీలను మోదీ ప్రారంభించారు. క్రీడాకారులను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. అట్టహాసంగా నిర్వహించిన ఆరంభ వేడుకల్లో కేంద్ర క్రీడలశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తదితరులు పాల్గొన్నారు. గేమ్స్‌ కోసం చేసిన ఏర్పాట్లపై రిజిజు సంతోషం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 159 వర్సిటీల నుంచి 3,400 మందికి పైగా అథ్లెట్లు 17 క్రీడాంశాల్లో పోటీపడుతున్నారు. ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బాక్సింగ్‌, ఫెన్సింగ్‌, స్విమ్మింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, ఫుట్‌బాల్‌, హాకీ, టేబుల్‌ టెన్నిస్‌, వాలీబాల్‌, టెన్నిస్‌, రగ్బీ, కబడ్డీ పోటీల్లో జాతీయ స్థాయిలో సత్తాచాటాలని వర్సిటీ విద్యార్థులు ఆశిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories