PM Modi: అమెరికా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని మోడీ

PM Modi: ఇవాళ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్ తో భేటీ

Sandeep Eggoju
Updated on: 23 Sept 2021 6:28 AM IST
PM Modi Went to America for Five Days Visit
X

అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ (ట్విట్టర్ ఇమేజ్)

PM Modi: భారత ప్రధాని మోడి ఐదురోజల పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లారు. వాషింగ్ టన్ లో అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ను కలిసి వివిధ అంశాలపై చర్చించనున్నారు. రేపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో మోడీ సమావేశం కానున్నారు. అమెరికాతో భారత ద్వైపాక్షిక సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడం,. పెట్టుబడులు, రక్షణ రంగాలు, అఫ్ఘనిస్తాన్ లోని పరిస్థితులు, ఉగ్రవాద నిర్మూలన, ఇండో-పసిఫిక్, వాతావరణ మార్పులు వంటి అంశాలపై బైడెన్ తో మోడీ చర్చలు జరపనున్నారు. అలాగే అస్ట్రేలియా, భారత్ జపాన్, అమెరికా కూటమి సదస్సులో మోడీ పాల్గొననున్నారు. ఈ నెల 25న న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని ప్రసంగించి ఆదివారం రోజున భారత్ కు తిరుగుప్రయాణం కానున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story