మోహన్ బాబుతో భేటీపై ప్రధాని మోదీ ట్వీట్

మోహన్ బాబుతో భేటీపై ప్రధాని మోదీ ట్వీట్
x
Pm Modi, Mohan babu Family
Highlights

ముఖ నటుడు మోహన్‌బాబు కుటుంబం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైయ్యారు. సమావేశం అనంతరం ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

ప్రముఖ నటుడు మోహన్‌బాబు కుటుంబం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైయ్యారు. సమావేశం అనంతరం ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. మోహన్‌బాబు కుటుంబంతో మోదీ కలిసిన ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. మోహన్‌బాబు మీ కుటుంబంతో, మీతో సమావేశం కావడం ఎంతో సంతోషంగా ఉంది. చాలా విషయాలపై మన మధ్య చర్చ జరిగింది. సినిమాల గురించి, ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాలు ఎలా పెంచాలని అనే అంశాలపై ఇరువురం చర్చించామని అంటూ మోదీ ట్విటర్‌లో వెల్లడించారు. మోదీతో సమావేశం సందర్భంగా 'వాట్‌ ఏ మ్యాన్‌!' అని కామెంట్ తో మోహన్ బాబు ట్విట్ కు ట్యాగ్ చేశారు.

అయితే ఈ సమావేశం మోహన్‌బాబుతోపాటు కుమారులు విష్ణు, మనోజ్, కూతురు మంచు లక్ష్మీ కూడా ఉన్నారు. సమావేశం అనంతరం మోహన్‌బాబు మాట్లాడారు... ప్రధాని మోడి, అమిత్ షాలను ప్రశంసలతో ముంచెత్తారు. దేశాన్ని గొప్ప స్థానంలో నిలిపిన వ్యక్తి మోడీ ఒక్కరే అన్నారు. హోంమంత్రి పదవికి వన్నెతెచ్చిన నేత అమిత్‌ షా అని ప్రశంసించారు. బీజేపీ పాలన కొంతమందికి మంచిగా కొంతమందికి చెడుగా ఉండటమే సహజమేనని అన్నారు. మోడీ, షాలతో భేటీలో ఏం మాట్లాడుకున్నామో త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు.

అయితే ప్రధాని మోదీతో మోహన్‌ బాబు సమావేశం కావడంపై బీజేపీలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అయితే అమిత్‌ షాను కలిసిన అనంతరం మోహన్‌ బాబు మీడియాతో మాట్లాడారు... మోదీ మిమ్మల్ని బీజేపీలోకి ఆహ్వానించారా? అని ప్రశ్నించగా.. ఆ విషయం మోహన్‌బాబు దాటవేశారు. తిరుపతిలోని తమ విద్యాసంస్థలను సందర్శించాలని మోదీని కోరానన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories