Mahakal Lok: శిల్పకళా అద్భుతం 'మహాకాల్ లోక్'.. రేపు ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం

PM Modi to Inaugurate Ujjain Mahakal Lok on 11th October
x

Mahakal Lok: శిల్పకళా అద్భుతం 'మహాకాల్ లోక్'.. రేపు ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం

Highlights

Mahakal Lok:మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర్ ఆలయ ఆవరణ అభివృద్ధి.. ప్రాజెక్టు తొలిదశ కింద రూ.856 కోట్లతో నిర్మాణం

Mahakal Lok: ప్రధాని మోదీ చేతుల మీదుగా రేపు మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలోని 'మహాకాల్‌ లోక్‌' ప్రారంభించనున్నారు. మధ్యప్రదేశ్‌లో ఉన్న పురాతన మహాకాళేశ్వర్‌ ఆలయ ఆవరణ అభివృద్ధి ప్రాజెక్టు తొలిదశ కింద 856 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణాలు పూర్తి చేశారు. మధ్యప్రదేశ్‌ రాజధాని నగరమైన భోపాల్‌కు ఇది 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆలయం పక్కనే ఉన్న రుద్రసాగర్‌ సరస్సును పునరుద్ధరణ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేశారు. ఏడాది పొడవునా భక్తుల రాకపోకలు ఉండే మహాకాళేశ్వర్‌ ఆలయం దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.

నందులు స్వాగతం పలుతున్నట్టుగా ఉన్న ఎత్తయిన రెండు ప్రవేశద్వారాలు. లోపలికి నందుల సుస్వాగతం.. 108 రాజస్థాన్‌ రాతిస్తంభాలు.. జలయంత్రాలు.. 50కు పైగా శివపురాణాన్ని తెలిపే కుడ్యచిత్రాలు.. ఇవన్నీ మనల్ని ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకువెళతాయి. 2017లో ఈ ప్రాజెక్టు మొదలుకాగా.. గుజరాత్‌, రాజస్థాన్‌, ఒడిశా రాష్ట్రాల కార్మికులు నిర్మాణాలను తీర్చిదిద్దారు. మహాకవి కాళిదాసు 'అభిజ్ఞాన శాకుంతలం'లో పేర్కొన్న జాతుల మొక్కలను సైతం ఇక్కడి ఆవరణలో నాటారు. రుద్రాక్ష్, బేల్‌పత్ర, సప్తపర్ణి వంటి 40 నుంచి 45 రకాల మొక్కలు సందర్శకులను అలరిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories