దంగల్‌ చిత్రాన్ని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ చూశారు

దంగల్‌ చిత్రాన్ని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ చూశారు
x
Highlights

కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన రెజ్లర్ ఫోగట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.

కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన రెజ్లర్ ఫోగట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. బబితా ఫోగట్, తండ్రి మహావీర్‌ ఫోగట్‌ జీవిత కథ ఆధారంగా దంగల్ చిత్రం వచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా దాద్రి నియోజకవర్గంలో నిర్వ హించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. మహావీర్‌ ఫోగట్‌ తన కుమార్తెలకు మల్ల విద్యలో శిక్షణనిచ్చి విజయపథంలో నడిపించారని ప్రశంసించారు.

దంగల్‌ చిత్రాన్ని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ చూసినట్లుగా తనకు తెలిపారని మోదీ వెల్లడించారు. ఇటీవలే బబితా ఫోగట్, తండ్రి మహావీర్‌ ఫోగట్‌ బీజేపీలో చేరినవిషయం తెలిసిందే. అనంతరం బబితా ఫోగట్ మాట్లాడుతూ..ప్రధాని తన గురించి గొప్పగా చెప్పడం తనకు గర్వంగా ఉందని తెలిపారు. అందుకు మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆమె పేర్కొన్నారు. జబితాఫోగట్ హర్యానాలోని దాద్రి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories