Narendra Modi: ఇంట్లోకి వచ్చేదాకా వేచిచూడొద్దు.. ఉగ్రవాదులను వెంబడించాలి

Narendra Modi: భారత్‌లో ఎన్నో విలువైన ప్రాణాలను కోల్పోయాం

Jyothi
Updated on: 18 Nov 2022 1:11 PM IST
PM Modi Said we are Fighting Against Terrorism Bravely
X

Narendra Modi: ఇంట్లోకి వచ్చేదాకా వేచిచూడొద్దు.. ఉగ్రవాదులను వెంబడించాలి

PM Modi: ఉగ్రదాడి ఏ ప్రాంతంలో జరిగినా.. ఏ స్థాయిలో ఉన్నా ప్రతిస్పందన మాత్రం తీవ్రంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పష్టం చేశారు. ఉగ్ర ముఠాలకు నిధులను నిరోధించే అంశంపై ఢిల్లీ వేదికగా 'నో మనీ ఫర్‌ టెర్రర్‌' అంతర్జాతీయ సదస్సును ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగించారు. ఉగ్రదాడులు జరిగేదాకా ఎదురుచూడటం సరికాదని, మనమే వారిని వెంబడించి మట్టుబెట్టాలన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేంతవరకూ తమ ప్రభుత్వం విశ్రాంతి తీసుకోబోదని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్‌ ప్రపంచం ఏకమవ్వాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌ అనేక విధాలుగా ఉగ్రదాడులను ఎదుర్కొంటోందని తెలిపారు. ఎన్నో విలువైన ప్రాణాలను మనం కోల్పోయాం.. కానీ దీనిపై మనం ధైర్యంగా పోరాడుతున్నామని చెప్పారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేంతవరకు మేం విశ్రమించబోమని చెప్పారు.

Jyothi

Jyothi

Next Story