
భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం రష్యాలో పర్యటిస్తున్నారు. నిరాడంబరంగా తన పని తాను చేసుకుపోవడంలో మోడీ కి ప్రజల్లో మంచి పేరు ఉంది. ఇప్పుడు రష్యా పర్యటనలో అయన చేసిన పని వారిలో మోడీ పట్ల తమ అభిమానాన్ని రెట్టింపు చేసింది.
భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం రష్యాలో పర్యటిస్తున్నారు. నిరాడంబరంగా తన పని తాను చేసుకుపోవడంలో మోడీ కి ప్రజల్లో మంచి పేరు ఉంది. ఇప్పుడు రష్యా పర్యటనలో అయన చేసిన పని వారిలో మోడీ పట్ల తమ అభిమానాన్ని రెట్టింపు చేసింది.
రష్యాలోని వ్లాదివోస్తోక్ లో తూర్పు ఆర్థిక వేదిక 5వ సదస్సు జరుగుతోంది. అందులో భారత ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సమావేశాల తరువాత ఫోటోలు దిగే కార్యక్రమం ఏర్పాటు చేశారు అక్కడి అధికారులు. దీనికోసం మోడీకి ప్రత్యేకంగా కుర్చీని ఏర్పాటు చేశారు. అయితే, మోడీ ఆ కుర్చీ పై కూచోవడానికి వ్యతిరేకించారు. తనకూ అందరితో పాటూ మామూలు కుర్చీ వేయాలని అక్కడి అధికారులను కోరారు. దీంతో ఆ అధికారులు ఆయనకు అందరితో పాటు కుర్చీ వేశారు. తరువాత ఫోటో కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు.
ఈ వ్యవహారాన్నంతా కేంద్ర మంత్రి పీయూష్ గోషల్ వీడియో రూపంలో సోషల్ మీడియాలో ఉంచారు. అంతే కాకుండా.. మోడీ తీరు అయన నిరాడంబరతకు నిదర్శనం అంటూ కామెంట్ రాశారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. వీడియో చూసిన వారంతా మోడీ నిరాడంబరతను మెచ్చుకుంటూ.. తమ కామెంట్లను పెడుతున్నారు. మా మోడీ గ్రేట్ అంటూ మురిసిపోతున్నారు.
PM @NarendraModi जी की सरलता का उदाहरण आज पुनः देखने को मिला, उन्होंने रूस में अपने लिए की गई विशेष व्यवस्था को हटवा कर अन्य लोगों के साथ सामान्य कुर्सी पर बैठने की इच्छा जाहिर की। pic.twitter.com/6Rn7eHid6N
— Piyush Goyal (@PiyushGoyal) September 5, 2019

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




