Instagram Top-10: మోదీని దాటిన ఆ ముగ్గురు...!

Top 10 Indians With Highest Followers on Instagram
x

ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీని దాటిన ఆ ముగ్గురు...?

Highlights

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో భారత ప్రధానమంత్రి మోదీకి 9 కోట్ల 24 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే, ఈ విషయంలో మోదీని మించినవారు ముగ్గురున్నారు. వారు ఎవరు? వారికున్న ఫాలోవర్లు ఎందరు?

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో భారత ప్రధానమంత్రి మోదీకి 9 కోట్ల 24 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే, ఈ విషయంలో మోదీని మించినవారు ముగ్గురున్నారు. వారు ఎవరు? వారికున్న ఫాలోవర్లు ఎందరు?

సోషల్ మీడియా నెట్ వర్క్స్ ఈ ఆధునిక యుగంలో మనిషి జీవితాన్ని నిర్వచిస్తున్నాయి. ఫేస్ బుక్, ట్విటర్, స్నాప్ చాట్, ఇన్‌స్టా ఇలా రకరకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఇప్పుడు కోట్ల మంది విజిటర్లతో రద్దీగా మారిపోయాయి. అయితే, వీటిలో ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు అత్యంత పాపులర్ ప్లాట్‌ఫామ్‌గా మారిపోయింది. ముఖ్యంగా, యంగ్ జనరేషన్లో ఈ యాప్ అంటే అదో రకమైన క్రేజ్.

డిమాండ్‌సేజ్ వెబ్ సైట్ వివరాల ప్రకారం (మెటా సంస్థ యూజర్ల వివరాలు షేర్ చేయదు. ఇది ఎక్స్‌టర్నల్ డేటా ఆధారంగా వేసిన అంచనాలు) ఇన్‌స్టాగ్రామ్‌కు రోజూ 50 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. నెలకు దాదాపు 200 కోట్ల మంది యాక్టివ్ యూజర్లున్నఇన్‌స్టాలో మెజారిటీ యూజర్లంతా జెన్-జెడ్, మిలేనియల్సే.

ఇన్‌స్టా యూజర్లలో నంబర్ వన్ దేశం మాత్రం ఇండియానే. వరల్డ్ వైడ్‌గా ఉన్న 200 కోట్ల యాక్టివ్ యూజర్లలో 38 కోట్ల మంది ఇండియన్లే.

ఇన్‌స్టా యూజర్లు కేవలం తమ గురించి, తమకు నచ్చిన వాటి గురించి ఫోటోలు, టెక్స్ట్ షేర్ చేయడం మాత్రమే కాకుండా తమ ఆడియన్స్‌తో ఎంగేజ్ అవుతుంటారు. దాంతో, ఇన్‌స్టాలో బలమైన కమ్యూనిటీస్ ఏర్పడుతున్నాయి. అదే ఈ సోషల్ వేదిక విస్తృతికి ప్రధాన కారణం.

ఇప్పుడు ఇన్‌స్టాలో అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్న ఇండియన్స్ ఎవరో చూద్దాం.

2025 వివరాల ప్రకారం ఇండియాలో ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ది మోస్ట్ ఫాలోవ్డ్ సెలెబ్రిటీ’ మరెవరో కాదు విరాట్ కోహ్లీ. ఈ విషయంలో క్రికెటర్లలో విరాట్ ప్రపంచంలోనే నంబర్ వన్ హోదా దక్కించుకున్నాడు. అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ఆసియన్ కూడా ఈ క్రికెటరే. ఆయనకు ఇన్‌స్టాలో 27 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే విరాట్ కోహ్లీది 16వ ర్యాంక్.

విరాట్ కోహ్లీ తరువాత సెకండ్ ప్లేస్‌లో ఉన్న సెలెబ్రిటీ ఎవరంటే... బాలీవుడ్ గ్లామరస్ డాల్ శ్రద్ధా కపూర్. సాహో చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా నటించిన ఈ అందాల నటిని 9 కోట్ల 42 లక్ష మంది ఫాలో చేస్తున్నారు. 9 కోట్ల 25 లక్షల ఫాలోవర్స్‌తో ప్రియాంక చోప్రా ఈవరసలో మూడో స్థానంలో ఉన్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ నాలుగో స్థానంలో ఉన్నారు. 9 కోట్ల 24 లక్షల మంది ఈ సోషల్ వేదికలో మోదీని ఫాలో చేస్తున్నారు.

ఊర్వశి రౌతేలా తెలుసుగా? డాకూ మహరాజ్ చిత్రంలో బాలయ్య బాబుతో సెన్సేషనల్ స్టెప్స్ వేసిన ఈ నటి కూడా మోస్ట్ ఫాలోవ్‌డ్ సెలెబ్రిటీస్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ టాప్-10 లిస్టులో 9వ స్థానాన్ని దక్కించుకున్నారు.

టాప్-10 జాబితా ఇదే...


గమనిక: ఈ లెక్కలు 2025 జనవరి చివరి వారం నాటివి. సోషల్ మీడియాలో ఫోలోవర్స్ సంఖ్య ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories