TOP 6 NEWS @ 6PM: మారిషస్ అధ్యక్షుడికి, ఆయన సతీమణికి ప్రధాని మోదీ ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా?


TOP 6 NEWS @ 6PM: మారిషస్ అధ్యక్షుడికి, ఆయన సతీమణికి ప్రధాని మోదీ ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా?
1) తెలంగాణ గ్రూప్-2 ఫలితాల విడుదల తెలంగాణ గ్రూప్ 2 ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. రాష్ట్రంలోని 783 గ్రూప్ 2 పోస్టుల...
1) తెలంగాణ గ్రూప్-2 ఫలితాల విడుదల
తెలంగాణ గ్రూప్ 2 ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. రాష్ట్రంలోని 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు సంబంధించి మార్కులతో కూడిన జనరల్ ర్యాంకు జాబితాను పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది.
గ్రూప్ 2 పరీక్ష రాసిన 2.36 లక్షల మంది అభ్యర్థులు.గ్రూప్ 2 టాపర్ కు 447 మార్కులు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్ లో ఓఎంఆర్ షీట్లను కూడా పొందుపర్చారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ tspsc. gov.in వెబ్ సైట్ లో అభ్యర్ధులు తమ ఫలితాలు చూసుకోవచ్చు. గ్రూప్ 2 టాప్ ర్యాంకర్ ఎన్. వెంకట హర్షవర్ధన్ 447 మార్కులతో గ్రూప్ 2 లో ఫస్ట్ ర్యాంకు పొందారు. 444 మార్కులతో వడ్లకొండ సచిన్ రెండో ర్యాంకు పొందారు. 439 మార్కులతో మనోహర్ రావుకు మూడో ర్యాంకు సాధించారు.
2) ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం: రోబోతో రెస్క్యూ ఆపరేషన్స్
SLBC Tunnel Collapse: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో 18వ రోజు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. మంగళవారం రోబోతో రోబోటిక్ బృందం టన్నెల్ లో సహాయక చర్యలు చేపట్టారు. యాన్వీ రోబోటిక్స్ ఆధ్వర్యంలో పరిస్థితులపై అంచనా వేయనున్నారు. మూడు రోజుల క్రితం రోబోటిక్స్ నిపుణుల బృందం టన్నెల్ లో పరిస్థితులను పరిశీలించారు. టన్నెల్ లోని పరిస్థితుల ఆధారంగా రోబోలతో రెస్క్యూ ఆపరేషన్స్ చేయాలని అధికారులు భావిస్తున్నారు.
టన్నెల్ లో ప్రమాదం జరిగిన ప్రాంతమంతా షీర్ జోన్. ఇక్కడ పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపితే సొరంగం టన్నెల్ పైకప్పు మళ్లీ కూలిపోయే ప్రమాదం ఉందనే అనుమానాలు కూడా ఉన్నాయి. దీంతో రోబో సేవలను ఉపయోగించుకోవాలని అధికారులు భావించారు. యాన్వీ రోబోను టన్నెల్ లోకి పంపారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3) Visakhapatnam: హయగ్రీవ భూముల్లో రెవెన్యూశాఖ బోర్డులు
Visakhapatnam: విశాఖ హయగ్రీవ భూముల్లో రెవెన్యూశాఖ బోర్డులు ఏర్పాటు చేసింది. ఎండాడ ప్రభుత్వ భూముల్లో రెవెన్యూ యంత్రాంగం బోర్డులు పెట్టింది. హయగ్రీవ ఫామ్స్ అండ్ డెవలపర్స్‌కు కేటాయించిన 12.51 ఎకరాల భూమిని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వృద్ధులు, ఓల్డేజ్ హోమ్ నిర్మాణం పేరుతో భూములు తీసుకుని.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు విచారణలో నిర్ధారణ అయింది. భూమి కేటాయింపు జరిగాక.. అసలు ఉద్దేశాన్ని పక్కన పెట్టి.. అనేక తప్పిదాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు.
అనాథలకు, వృద్ధులకు ఇళ్లు నిర్మిస్తామని చెప్పి.. 54 శాతం నిర్మాణాలకు అనుమతించిన భూమిలో 90శాతం అమ్మకాలు జరిగినట్టు వివరాలు సేకరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతోనే హయగ్రీవ సంస్థ.. ఈ భూములను విక్రయించాలని చూసిందని నిర్థారణకు వచ్చింది. ఇది భూ కేటాయింపు నిబంధనలకు విరుద్ధమని రుజువు కావడంతో హయగ్రీవ సంస్థకు కేటాయించిన 12.51 ఎకరాలును రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో.. ఆ భూముల్లో బోర్డులు ఏర్పాటు చేసింది రెవెన్యూశాఖ.
4) అమెరికా విషయంలో భారత్ తాజా ప్రకటన... మరి ట్రంప్ చెప్పింది అబద్దమేనా?
India is not reducing tariffs on Imports from US: అమెరికా ఉత్పత్తుల దిగుమతులపై భారత్ విధించే సుంకాన్ని తగ్గించడం లేదని కేంద్రం స్పష్టంచేసింది. ఈ విషయంలో అమెరికాతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని కేంద్రం పార్లమెంట్ ప్యానెల్ కు చెప్పినట్లుగా ఎన్డీటీవీ వార్తా కథనం వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పదేపదే ఎత్తుతున్న ఈ సమస్యను పరిష్కరించేందుకు సెప్టెంబర్ వరకు సమయం ఇవ్వాల్సిందిగా కోరినట్లు కేంద్రం చెప్పింది.
అయితే, మార్చి 7న డోనల్డ్ ట్రంప్ వైట్ హౌజ్‌లో అమెరికా మీడియాతో మాట్లాడుతూ అమెరికా దిగుమతులపై ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించేందుకు భారత్ అంగీకరించిందని అన్నారు. ఎట్టకేలకు భారత్ దిగొచ్చిందన్నట్లుగా ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఏప్రిల్ 2 నుండి భారత్ ఉత్పత్తులపై భారీ సుంకం విధిస్తామన్న అమెరికా హెచ్చరికలకు భారత్ దిగొచ్చిందనే సంకేతాలు వెళ్లాయి. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5) ఏటీఎంలో డబ్బులు ఉండటం లేదా? కారణం ఏంటో తెలుసా?
No cash in ATMs: డబ్బులు డ్రా చేయడం కోసం ఏటీఎంకు వెళ్తే అక్కడ నో క్యాష్ బోర్డ్ కనిపిస్తోందా? లేదంటే ఏటీఎంలు మెయింటెనెన్స్‌లో లేకుండా చెత్తచెత్తగా కనిపిస్తున్నాయా? దానికి కారణం ఏంటో తెలుసా? అయితే, ఇది మీకొక్కరికే ఎదురవుతున్న పరిస్థితి కాదు. లేదంటే కేవలం మీ ఏరియాకే ఇలాంటి సమస్య పరిమితమై లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఏటీఎంలో ఇప్పుడు ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఏటీఎంలను మెయింటెన్ చేసే సర్వీస్ ప్రొవైడర్ సంస్థల్లో ఒకటైన ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ అనే సంస్థ దివాలా తీయడమే అందుకు కారణం. దేశంలో అనేక పెద్ద పెద్ద బ్యాంకులకు ఈ సంస్థే ఏటీఎం సేవలు అందిస్తోంది. అందుకే దేశంలో వేల సంఖ్యలో ఏటీఎం సేవలు నిలిచిపోయాయి.
అసలేం జరిగిందంటే.. ఫిబ్రవరిలో ఐసిఐసిఐ బ్యాంకుకు చెందిన అనేక ఏటీఎంలలో క్యాష్ లేకుండాపోయింది. ఏటీఎంలలో క్యాష్ లోడ్ చేసేందుకు ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ సంస్థ సిబ్బంది నిరాకరించారు. నెలల తరబడిగా తమ సంస్థ జీతాలు చెల్లించడం లేదని వారు వాపోయారు. పెండింగ్ శాలరీస్ చెల్లించే వరకు పనిచేసేది లేదని చెప్పి నిరసన వ్యక్తంచేశారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6) మారిషస్ అధ్యక్షుడికి గంగా జలం, మఖానా, ఆయన సతీమణికి ప్రధాని మోదీ చీర బహుమతి
మారిషస్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్‌గూళం నుండి ఘన స్వాగతం లభించింది. మారిషస్ నేషనల్ డే సెలబ్రేషన్స్‌కు ప్రధాని మోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించిన నేపథ్యంలో ఆయన ఈ పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మారిషస్ వెళ్లిన ప్రధాని మోదీ అక్కడి ప్రధాని నవీన్ చంద్ర రామ్‌గూళంతో భేటీ అయ్యారు. ఇద్దరూ కలిసి సర్ సీవూసగూర్ రామ్‌గూళం బొటానికల్ గార్డెన్‌లో మొక్కను నాటారు.
మారిషస్ ప్రధానితో భేటీ అనంతరం ఆ దేశ అధ్యక్షుడు ధరమ్ గోఖూల్‌ను కలిశారు. ఇటీవలే మహా కుంభమేళా ముగిసిన సందర్భంగా భారత్ నుండి తీసుకెళ్లిన గంగా జలాన్ని, మఖానాను ఆయనకు బహుమతిగా అందించారు. బీహార్‌లో మఖానాకు ప్రత్యేక వంటకంగా పేరుంది. అలాగే ఆయన సతీమణికి బనారసి చీరను బహూకరించారు. భారత్, మార్షియస్ దేశాల మధ్య దౌత్య సంబంధాలను బలోపేతం చేసేలా మోదీ పర్యటన కొనసాగుతోంది.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire