దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

PM Modi Lay Foundation Stone Redevelopment 508 Railway Stations
x

దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Highlights

PM Modi: రూ.24.4 కోట్లతో రైల్వేస్టేషన్ల ఆధునికీకరణకు చర్యలు

PM Modi: దేశంలో రద్దీ ఎక్కువగా ఉండే రైల్వేస్టేషన్లను ఆధునికీకరించే లక్ష్యంతో కేంద్రం అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా.... ఇవాళ ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం కేంద్రం 24వేల 470 కోట్లను వెచ్చించనుంది. అందులో రాజస్థాన్‌లో 55, బిహార్‌లో 49, మహారాష్ట్ర 44, పశ్చిమ బంగాల్ 37, మధ్యప్రదేశ్ 34, అసోం 32, ఒడిశా 25, పంజాబ్ 22, గుజరాత్, తెలంగాణ 21, ఝార్ఖండ్ 20, ఏపీలోలో 18 తమిళనాడు 18, హరియాణా 15, కర్ణాటకలో 13 రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

నగరానికి ఇరువైపులా అనుసంధానం చేస్తూ ఆయా స్టేషన్లను సిటీ సెంటర్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడంతో సహా రైల్వేస్టేషన్ కేంద్రంగా నగరాభివృద్ధి జరుగుతుందని ప్రధాని కార్యాలయం తెలిపింది. రైల్వేస్టేషన్లలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు కల్పించడమే అభివృద్ధి పనుల లక్ష్యమని పీఎంవో వెల్లడించింది. ఆధునిక అవసరాలు, ప్రస్తుత ప్రజల అవసరాలకు అనుగుణంగా హైటెక్‌ హంగులతో, సకల సౌకర్యాలతో రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయబోతున్నారు. అందుకు సంబంధించిన కొన్ని స్టేషన్ల నమూనా ఫొటోలను కూడా విడుదలజేశారు.

వచ్చే ఏడాది ఆర్థిక సంవత్సరం వరకు పనులన్నీ పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. అయితే ఆధునీకరించే రైల్వే స్టేషన్ల ఫ్లాట్ ఫాం టికెట్ ధరలపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. మొదటి దశ పూర్తైన తర్వాత రెండో దశలో మిగతా స్టేషన్లను ఆధునీకరించనున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణకు శంకుస్థాప చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories