PM Modi: అండర్‌ టన్నెల్ మెట్రో.. ప్రారంభించి ప్రయాణించిన మోదీ

PM Modi Inaugurates India First Underwater Metro Tunnel in Kolkata
x

PM Modi: అండర్‌ టన్నెల్ మెట్రో.. ప్రారంభించి ప్రయాణించిన మోదీ

Highlights

PM Modi: రూ.120 కోట్లతో కోల్‌కతాలో నిర్మించిన ప్రభుత్వం

PM Modi: భారతదేశంలో తొలి అండర్ టన్నెల్ మెట్రో అందుబాటులోకి వచ్చింది. కోల్‌కతాలో నిర్మించిన ఈ అండర్‌ టన్నెల్ మెట్రోను ప్రధాని మోడీ ప్రారంభించారు. జెండా ఊపి మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోడీ.. టన్నెల్ నిర్మాణం గురించి మెట్రో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెట్రోలో స్కూల్ విద్యార్థులతో కలిసి ప్రయాణించారు ప్రధాని. విద్యార్థులతో ముచ్చటిస్తూ సరదాగా గడిపారు.

కోల్‌కతా ఈస్ట్‌- వెస్ట్‌ మెట్రో కారిడార్‌ కింద దాదాపు 120 కోట్ల రూపాయల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది కింద నిర్మించారు. ఈ అండర్ టన్నెల్‌ మెట్రో మార్గం పొడవు 16.6 కిలోమీటర్లు కాగా.. 10.8 కిలోమీటర్ల భూగర్భంలో ఉంటుంది. ఈ ప్రాజెక్టులో హావ్‌డా మైదాన్‌ నుంచి ఎస్‌ప్లెనెడ్‌ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైనులో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్‌వాటర్‌ మెట్రో టన్నెల్‌ నిర్మించారు. నదిలోని ఈ దూరాన్ని మెట్రో రైలు 45 సెకన్లలో దాటనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories