Modi: జీ7 శిఖరాగ్ర సదస్సు కోసం జపాన్‌కు ప్రధాని.. ప్రపంచ సవాళ్లపై ప్రసంగం

PM Modi In Japan Today For G7 Summit
x

Modi: జీ7 శిఖరాగ్ర సదస్సు కోసం జపాన్‌కు ప్రధాని.. ప్రపంచ సవాళ్లపై ప్రసంగం

Highlights

Modi: మే 19 నుంచి మే 21 వరకు హిరోషిమాలో ఉండునున్న మోడి

Modi: జి7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌కు వెళ్లనున్నారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు ప్రధాని తూర్పు ఆసియా దేశాన్ని సందర్శిస్తున్నారు. శక్తివంతమైన సమూహం ప్రస్తుత అధ్యక్షుడిగా జపాన్ జీ7 సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. మే 19 నుంచి మే 21 వరకు G7 శిఖరాగ్ర సదస్సు కోసం ప్రధాని మోదీ హిరోషిమాలో ఉండనున్నారు. ఆహారం, ఎరువులు, ఇంధన భద్రతతో సహా ప్రపంచ సవాళ్లపై ఆయన ప్రసంగించనున్నారు.

ఇండియా-జపాన్ సమ్మిట్ కోసం ఇటీవల భారత పర్యటన తర్వాత ప్రధాన మంత్రి ఫుమియో కిషిదాను మళ్లీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం G20 అధ్యక్ష పదవిని భారతదేశం నిర్వహిస్తున్నందున ఈ జీ7 సమ్మిట్‌లో నా ఉనికి చాలా అర్థవంతంగా ఉంది" అని ప్రధాని మోదీ అన్నారు."ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని సమిష్టిగా పరిష్కరించాల్సిన అవసరంపై జీ7 దేశాలు, ఇతర ఆహ్వానించబడిన భాగస్వాములతో అభిప్రాయాలను పంచుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు ప్రధాని తెలిపారు. జీ7 సదస్సుకు హాజరయ్యే నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రధాని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories