అక్కడ మూడు 'కరోనా' కేసులు నిర్ధారణ.. ప్రధాని పర్యటన రద్దు

అక్కడ మూడు కరోనా కేసులు నిర్ధారణ.. ప్రధాని పర్యటన రద్దు
x
Highlights

దక్షిణాసియాలో కరోనావైరస్ ప్రభావం అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ తన బాంగ్లాదేశ్ పర్యటనను వాయిదా వేసుకున్నారు. వాస్తవానికి బాంగ్లాదేశ్ లో...

దక్షిణాసియాలో కరోనావైరస్ ప్రభావం అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ తన బాంగ్లాదేశ్ పర్యటనను వాయిదా వేసుకున్నారు. వాస్తవానికి బాంగ్లాదేశ్ లో జరగాల్సి ఉన్న షేక్ ముజిబర్ రెహ్మాన్ (బంగ్లాదేశ్ తండ్రి) జయంతి వార్షికోత్సవాలతోపాటు పలు కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఢాకా రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ ప్రభావంతో ఈ వార్షికోత్సవాన్ని రద్దు చేసింది. దాంతో ప్రధాని మోదీ ఢాకా పర్యటన రద్దయింది. ఆదివారం, బంగ్లాదేశ్ తన మొదటి కరోనావైరస్ కేసులను నిర్ధారించింది. అధికారిక లెక్కల ప్రకారం ముగ్గురు వ్యక్తులకు కరోనావైరస్ పాజిటివ్ పరీక్షలు చేశారు. వీరిలో ఇద్దరు ఇటీవల ఇటలీ నుండి వచ్చారు. దీంతో బంగాళాదేశ్ లో వైరస్ వ్యాప్తిని నివారించడానికి, మార్చి 17 న షేక్ ముజిబర్ రెహ్మాన్ శతాబ్ది జన్మదిన వేడుకలను రద్దు చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.

కోవిడ్ -19 కి సంబంధించిన ప్రజారోగ్య పరిశీలనల కారణంగాషేక్ ముజిబర్ రెహ్మాన్ శతాబ్ది జన్మదిన ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలను వాయిదా వేయడం లేదా తగ్గించడం జరుగుతుందని వేడుక కమిటీ చైర్మన్ కమల్ అబ్దుల్ చౌదరి మీడియాతో అన్నారు.. ఈ కార్యక్రమాన్ని ఆడంబరంగా నిర్వహించదలుచుకోలేదని..ఏడాది పొడవునా చిన్న చిన్న వేడుకలు మాత్రమే జరపాలని నిర్ణయించుకున్నామని.. పెద్ద బహిరంగ సభలను రద్దు చేసినట్టు ఆయన చెప్పారు. అంతేకాదు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఈ వేడుకలను బహిరంగ సభ లేకుండా ప్రారంభిస్తారని చెప్పారు. సిఎఎ మరియు ప్రతిపాదిత ఎన్‌ఆర్‌సితో పాటు కరోనావైరస్ భయంతో బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న ఆందోళనల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 17 న డాకాకు వెళ్లాల్సి ఉంది.

మరోవైపు కరోనా వైరస్ ప్రభావం 90 దేశాలకు పైగా వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా లక్షమందికి పైగా వైరస్ భారిన పడ్డారు. కరోనాకు కేంద్రబిందువైన చైనాలో 80 వేల మందికి పైగా కరోనా వైరస్ భారిన పడ్డారు. ఇక్కడే 2800 మందికి పైగా మరణించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య 3 వేలకు పైగా ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories