Top
logo

Ugadi 2021: తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

PM Modi and President of India Greets People on Ugadhi Occassion
X

Ugadi 2021:(File Image)

Highlights

Ugadi 2021: శ్రీ ప్లవ నామ సంవత్సర పర్వదినం పురస్కరించుకుని తెలుగు ప్రజలకు రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ శుభాకాంక్షలు

Ugadi 2021: శ్రీ ప్లవ నామ సంవత్సర పర్వదినం పురస్కరించుకుని తెలుగు ప్రజలకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ మేరకు వారిద్దరూ మంగళవారం తెలుగులో ట్వీట్లు చేసి ప్రజలకు అభినందనలు తెలిపారు. 'తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని మన సోదర సోదరీమణులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఉగాది పర్వదినం సందర్భంగా శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంగా అందరికీ ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను' అని రాష్ట్రపతి ట్వీట్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

భారత ప్రధాని నరేంద్రమోదీ సైతం ట్విటర్‌ ద్వారా తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. 'అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను' అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.Web TitlePM Modi and President of India Greets People on Ugadhi Occasion
Next Story