PM Modi and German Chancellor Friedrich Merz: జర్మనీ ఛాన్సలర్‌తో కలిసి గాలిపటాలు ఎగురవేసిన ప్రధాని మోదీ!

PM Modi and German Chancellor Friedrich Merz: జర్మనీ ఛాన్సలర్‌తో కలిసి గాలిపటాలు ఎగురవేసిన ప్రధాని మోదీ!
x
Highlights

అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ పతంగుల పండుగను ప్రధాని మోదీ ప్రారంభించారు. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌తో కలిసి ఆయన గాలిపటాలు ఎగురవేసిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

సంక్రాంతి పండుగ వేళ గుజరాత్‌లో పతంగుల సందడి మొదలైంది. అహ్మదాబాద్‌లోని సబర్మతి నదీ తీరంలో సోమవారం అంతర్జాతీయ పతంగుల పండుగ (International Kite Festival 2026) అత్యంత వైభవంగా ప్రారంభమైంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వేడుకలను ఘనంగా ప్రారంభించారు.

ప్రత్యేక ఆకర్షణగా జర్మనీ ఛాన్సలర్

ఈ వేడుకలో ఒక ఆసక్తికరమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రధాని మోదీతో కలిసి జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ఈ పండుగలో పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి పతంగులను ఎగురవేస్తూ సందడి చేశారు. అనంతరం ఓపెన్ టాప్ జీప్‌లో కూర్చుని అక్కడకు విచ్చేసిన సందర్శకులకు అభివాదం చేశారు. ఇద్దరు అగ్రనేతలు ఇలా సరదాగా పతంగులు ఎగురవేయడం అందరినీ ఆకట్టుకుంది.

50 దేశాల భాగస్వామ్యం.. హనుమాన్ పతంగి హైలైట్!

ఈ అంతర్జాతీయ ఉత్సవంలో కేవలం భారత్ నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 దేశాల ప్రతినిధులు, పతంగుల ఔత్సాహికులు పాల్గొన్నారు.

హనుమాన్ పతంగి: ఈ ఏడాది వేడుకల్లో 'హనుమాన్' ఆకృతిలో రూపొందించిన పతంగి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

రికార్డ్ స్థాయిలో సందర్శకులు: గతేడాది ఈ ఫెస్టివల్‌కు 3.83 లక్షల మంది హాజరుకాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 5 లక్షలు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

గుజరాత్ సంస్కృతిని ప్రపంచానికి చాటుతూ..

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి ప్రధాని మోదీ ఈ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రధాని హోదాలో విదేశీ నేతలను ఆహ్వానించి మన దేశ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories