భిన్నత్వంలో ఏకత్వాం అంటే ఇదే : మోదీ

భిన్నత్వంలో ఏకత్వాం అంటే ఇదే : మోదీ
x
Highlights

భారతదేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసిన అయోధ్య వివాదాస్పద భూమి రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో సుప్రీకోర్టు శనివారం కీలక తీర్పు వెల్లడించింది.

భారతదేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసిన అయోధ్య వివాదాస్పద భూమి రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో సుప్రీకోర్టు శనివారం కీలక తీర్పు వెల్లడించింది. 40 రోజుల పాటు వరుసగా విచారణ చేసిన రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని సర్వోన్నత న్యాయస్థానం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ఆలయ నిర్మాణం కోసం 3 నెలల్లో అయోధ్య ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయోధ్యలోనే బాబ్రీ మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్‌ బోర్డుకు 5 ఎకరాల స్థలం ఇవ్వాలని తెలిపింది.

అయోధ్య తీర్పుపై ప్రధాని మోదీ స్పందించారు. రామ జన్మభూమి– బాబ్రీ మసీదు మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 134 సంవత్సరాలుగా వస్తున్న ఈ వివాదానికి ఇవాళ్టితో తెరపడిందని అభిప్రాయపడ్డారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును దేశమంతా స్వాగతిస్తోందని,ప్రపంచ దేశాలకు భారత్ గొప్పతనం తెలిసిందని అన్నారు. ఈ సందర్భంగా ఈ రోజు చరిత్రక రోజు, భారతధేశ న్యాయవవస్థ పట్ల అంతర్జాతీయంగా ప్రసంశలు వస్తున్నాయి. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఎవరూ విజయం పరాజయంగా చూడకండి. నవభారత్ నిర్మాణానికి నాంది పలుకుదాం అని వ్యాఖ్యానించారు. భిన్నత్వంలో ఏకత్వాం అంటే ఇదే అని మోదీ పేర్కొన్నారు.అవాంఛనియ ఘటనలకు పాల్పడకుండా ప్రజలకు సంయమనం పాటించారని, అందరూ తీర్పును స్వాగతించారని మోదీ తన ప్రసంగంలో తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories