అన్నదాతలకి అలర్ట్‌.. నెలకి రూ.200 పొదుపుతో ఏడాదికి రూ.36000..!

pm man dhan yojna benefits farmers will get rs 36000 every year
x

అన్నదాతలకి అలర్ట్‌.. నెలకి రూ.200 పొదుపుతో ఏడాదికి రూ.36000..!

Highlights

అన్నదాతలకి అలర్ట్‌.. నెలకి రూ.200 పొదుపుతో ఏడాదికి రూ.36000..!

PM Kisan Man Dhan Yojna: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులకు శుభవార్త. ఈ పథకం కింద రైతులు ప్రతి నెలా 3000 రూపాయలు పొందవచ్చు. దీని కోసం ఎటువంటి పత్రాలు అందించవలసిన అవసరం లేదు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద, ఇప్పటి వరకు రైతులకు సంవత్సరానికి 2000 అంటే 6000 రూపాయలు మూడు వాయిదాలలో లభిస్తాయి. కానీ ఇప్పుడు మీరు ఈ పథకం కింద సంవత్సరానికి రూ.36000 పొందవచ్చు. దీని పూర్తి ప్రక్రియను తెలుసుకుందాం.

పీఎం కిసాన్ మాన్‌ధన్‌ యోజన కింద రైతులకు ప్రతి నెలా పింఛను అందజేస్తారు. ఈ పథకం కింద 60 ఏళ్లు నిండిన తర్వాత రైతులకు ప్రతి నెల రూ.3000 అంటే సంవత్సరానికి రూ.36000 పింఛను అందజేస్తారు. నిజానికి మోడీ ప్రభుత్వం ఈ మొత్తాన్ని రైతులకు ఆర్థిక సహాయం చేయడానికి ప్రవేశపెట్టింది. ఈ పథకంలో చిన్న మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా మీరు గ్యారెంటీ పెన్షన్ పొందవచ్చు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి మీకు కొన్ని పత్రాలు అవసరం. ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు ఉండాలి. కానీ మీరు PM కిసాన్ ప్రయోజనాన్న పొందుతున్నట్లయితే దీని కోసం ఎటువంటి అదనపు పత్రాన్ని సమర్పించాల్సిన అవసరం లేదు. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న రైతులు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో వయస్సును బట్టి పెట్టుబడి మొత్తాన్ని నిర్ణయించారు.

ఈ పథకానికి ఎవరు అర్హులు

1. ఈ పథకం ప్రయోజనాన్ని 18 నుంచి 40 సంవత్సరాలలోపు ఏ రైతు అయినా తీసుకోవచ్చు.

2. దీని కోసం సాగు భూమి గరిష్టంగా 2 హెక్టార్ల వరకు ఉండాలి.

3. ఇందులో కనిష్టంగా 20 ఏళ్లు, గరిష్టంగా 40 ఏళ్ల వరకు ఉన్న రైతుల వయస్సును బట్టి నెలకు

రూ. 55 నుంచి రూ. 200 వరకు పెట్టుబడి పెట్టాలి.

4. 18 ఏళ్ల వయస్సులో చేరిన రైతులు నెలవారీగా రూ.55 చెల్లించాలి.

5. రైతు వయస్సు 30 ఏళ్లు అయితే రూ.110 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

6. మీరు 40 సంవత్సరాల వయస్సులో చేరినట్లయితే మీరు ప్రతి నెలా రూ. 200 డిపాజిట్ చేయాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories