నూతన సీవీసీగా సంజయ్ కొఠారి

నూతన సీవీసీగా సంజయ్ కొఠారి
x
Highlights

రాష్ట్రపతి కార్యదర్శి సంజయ్ కొఠారిని కేంద్ర నూతన చీఫ్‌ విజిలెన్స్ కమిషనర్‌గా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని హై పవర్ కమిటీ ఎంపిక చేసినట్లు ఒక...

రాష్ట్రపతి కార్యదర్శి సంజయ్ కొఠారిని కేంద్ర నూతన చీఫ్‌ విజిలెన్స్ కమిషనర్‌గా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని హై పవర్ కమిటీ ఎంపిక చేసినట్లు ఒక అధికారి బుధవారం తెలిపారు. ఈఅలాగే ప్రస్తుతం సమాచార కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న బిమల్‌ జుల్కాను కేంద్ర సమాచార కమిషన్‌లో ప్రధాన సమాచార కమిషనర్‌ (సీఐసీ) గా ఎంపికచేశారు.

ముగ్గురు సభ్యుల ప్యానెల్ సురేష్ పటేల్‌ను విజిలెన్స్ కమిషనర్‌గా, అనితా పండోవ్‌ను సమాచార కమిషనర్‌గా నియమించాలని మెజారిటీ సభ్యులు నిర్ణయించారు. కాగా ఎంపిక ప్యానెల్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఉన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తర్వాత ఈ నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యక్తిరేకిస్తోంది. నూతన సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ నియామకానికి అనుసరించిన ప్రక్రియను " చట్టవిరుద్ధం మరియు రాజ్యాంగ విరుద్ధం " అని కాంగ్రెస్ పేర్కొంది మరియు ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. మెజారిటీ నిర్ణయంతో రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) అధికారులుగా ఉన్న కొఠారి, జుల్కా నియామకానికి చేసిన సిఫార్సును లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి వ్యతిరేకించారు. మరోసారి దరఖాస్తులను ఆహ్వానించి తదుపరి సివిసిని నియమించడానికి ప్రభుత్వం సరికొత్త ప్రక్రియను ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ అన్నారు.

ప్రభుత్వం దాచడానికి చాలా ఉందని, సివిసి " రబ్బరు స్టాంప్ " గా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్లు తివారీ పేర్కొన్నారు. సివిసి, సిఐసిల నియామకంపై కాంగ్రెస్ ముఖ్య ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా కూడా ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు.. న్యూ ఇండియాలో పారదర్శకత, జవాబుదారీతనం మరియు రాజ్యాంగ ప్రక్రియలకు చోటు లేకుండా పోయిందని ఆరోపించారు. సివిసి, సిఐసి నియామకాలు " ఖుల్ జా సిమ్ సిమ్ " తరహాలో ఏకపక్షంగా జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

ఇదిఅలావుంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ స్వయంప్రతిపత్తి హోదా కలిగిన అవినీతి వాచ్డాగ్. ఇది ఏ కార్యనిర్వాహక అధికారం నుండి కూడా నియంత్రణ లేకుండా పనిచేస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వంలోని అన్ని విజిలెన్స్ కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతతో పాటు వారి ప్రణాళిక, అమలు, సమీక్ష మరియు సంస్కరించడంలో వివిధ అధికారులకు సలహా ఇస్తుంది. ఇక కేంద్ర సమాచార కమిషన్ సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం క్రింద ఏర్పడింది.. ఇది అన్ని కేంద్ర ప్రజా అధికారులపై అధికార పరిధిని కలిగి ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories