PM Kisan: రైతులకి అలర్ట్‌.. ఇకనుంచి పీఎం కిసాన్‌ పథకానికి వీరు అనర్హులు..!

PM Kisan update Only those who completed 21 years are eligible for this scheme
x

PM Kisan: రైతులకి అలర్ట్‌.. ఇకనుంచి పీఎం కిసాన్‌ పథకానికి వీరు అనర్హులు..!

Highlights

PM Kisan: రైతులకి అలర్ట్‌.. ఇకనుంచి పీఎం కిసాన్‌ పథకానికి వీరు అనర్హులు..!

PM Kisan: కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో అవకతవకలను నిరోధించడానికి కొత్త నియమాలను రూపొందిస్తోంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి భూ పత్రాలను తప్పనిసరి చేశారు. ఎందుకంటే ఈ పథకం కింద చాలామంది అనర్హులు లబ్ధిపొందుతున్నట్లుగా ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో వారిని గుర్తించే పనిలోపడింది. అనర్హుల తొలగింపు కోసం కొత్త నిబంధనలని రూపొందిస్తోంది.

ఇందులో భాగంగా ఫిబ్రవరి 1, 2001 కంటే ముందు జన్మించిన రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించింది. దీని ప్రకారం 21 సంవత్సరాలు నిండిన రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు అవుతారు. 1 ఫిబ్రవరి 2001 తర్వాత జన్మించిన వ్యక్తులు ఈ పథకం ప్రయోజనాన్ని పొందలేరు. ఈ విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పీఎం కిసాన్ నిధి ప్రయోజనం పొందుతున్న వాయిదాలని నిలిపివేస్తారు.

వివిధ రాష్ట్రాల్లో సామాజిక తనిఖీల ద్వారా తప్పుడు పత్రాల సాయంతో చాలామంది అనర్హులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లు తేలింది. వారికి నోటీసులు జారీ చేసి డబ్బులు తిరిగి వసూలు చేయాలనే పరిశీలనలో ఉంది. అంతేకాదు దరఖాస్తులని పున పరిశీలన చేస్తోంది. సంబంధిత అధికారులకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 1, 2001 తర్వాత జన్మించిన వారు ఇకపై ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోలేరు. అంతేకాదు స్కీమ్‌లో పెరుగుతున్న మోసాలను తనిఖీ చేయడానికి ఈ-కెవైసిని తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories