PM Kisan 22nd Installment : రైతన్నలకు అలర్ట్..22వ విడత డబ్బులు రావాలంటే ఇప్పుడే ఇలా చేయండి

రైతన్నలకు అలర్ట్..22వ విడత డబ్బులు రావాలంటే ఇప్పుడే ఇలా చేయండి

CR Reddy
Published on: 8 Feb 2026 8:23 AM IST
PM Kisan 22nd Installment : రైతన్నలకు అలర్ట్..22వ విడత డబ్బులు రావాలంటే ఇప్పుడే ఇలా చేయండి
X

PM Kisan 22nd Installment : దేశంలోని కోట్లాది మంది రైతులకు భరోసా కల్పిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం మరో కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే ప్రభుత్వం 21 వాయిదాలను సక్సెస్‌ఫుల్‌గా రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు అందరి కళ్లు 22వ విడత మీద ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందని రైతులు చాలా మంది ఉన్నారు. మరి అలాంటి వారు ఇప్పుడు అప్లై చేసుకుంటే డబ్బులు వస్తాయా? కొత్తగా చేరే వారికి 22వ కిస్తీ వర్తిస్తుందా? వంటి వివరాలు తెలుసుకుందాం.

కొత్త దరఖాస్తుదారులకు 22వ విడత అందుతుందా?

చాలా మంది రైతులు "మేము ఇప్పటి వరకు ఈ పథకంలో చేరలేదు, ఇప్పుడు అప్లై చేస్తే 22వ విడత వస్తుందా?" అని అడుగుతుంటారు. దానికి సమాధానం అవును. మీరు రైతు అయి ఉండి, మీ పేరు మీద సాగు భూమి ఉంటే.. ఇప్పటికైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం 22వ విడత నిధులను విడుదల చేసే లోపు మీ అప్లికేషన్ వెరిఫికేషన్ పూర్తయితే, కచ్చితంగా మీ ఖాతాలో రూ.2000 జమ అవుతాయి. అంటే మీరు ఇప్పుడే రిజిస్టర్ చేసుకున్నా ఈ పండగలో మీరు భాగస్వాములు కావచ్చు.

కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే

ఈ పథకంలో చేరడం చాలా సులభం. మీరు మీ ఊరిలోని గ్రామ రెవెన్యూ అధికారి (VRO) లేదా పట్టాదారుని కలవవచ్చు. ఒకవేళ మీరే స్వయంగా చేసుకోవాలనుకుంటే మీ దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కి వెళ్ళవచ్చు. దరఖాస్తు సమయంలో మీ దగ్గర ఉండాల్సిన ముఖ్యమైన పత్రాలు:

* మీ ఆధార్ కార్డ్

* బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ (డబ్బులు నేరుగా ఇందులోకే వస్తాయి)

* సాగు భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ బుక్ (Ownership documents)

* మీ మొబైల్ నంబర్ (ఆధార్ తో లింక్ అయి ఉండాలి)

ఆన్‌లైన్‌లో చిటికెలో అప్లై చేసేయండిలా..

* మీకు ఇంటర్నెట్ వాడటం వస్తే మీ స్మార్ట్ ఫోన్ నుంచే అప్లై చేసుకోవచ్చు:

* ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ (pmkisan.gov.in) కి వెళ్ళండి.

* హోమ్ పేజీలో 'Farmer Corner' విభాగంలో 'New Farmer Registration' పై క్లిక్ చేయండి.

* మీరు గ్రామీణ రైతులా (Rural) లేక పట్టణ రైతులా (Urban) అనేది ఎంచుకోండి.

* మీ ఆధార్ నంబర్, రాష్ట్రం పేరు ఎంటర్ చేసి సర్చ్ చేయండి.

* మీ వివరాలు డేటాబేస్ లో లేకపోతే.. కొత్తగా రిజిస్టర్ చేయాలా అని అడుగుతుంది. 'Yes' అని క్లిక్ చేయండి.

* అక్కడ వచ్చే ఫామ్ లో మీ పేరు, బ్యాంక్ డీటెయిల్స్, భూమి వివరాలు తప్పులు లేకుండా నింపండి.

* చివరగా సేవ్ బటన్ నొక్కండి. మీ దరఖాస్తు సంబంధిత అధికారుల వెరిఫికేషన్‌కు వెళ్తుంది.

కేవలం దరఖాస్తు చేస్తేనే డబ్బులు రావు. మీ ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండాలి (e-KYC). అలాగే భూమి రికార్డులు మీ పేరు మీద స్పష్టంగా ఉండాలి. ప్రభుత్వం ప్రతి ఏటా మూడు విడతల్లో రూ.2000 చొప్పున మొత్తం రూ.6000 ఇస్తోంది. ఇప్పటి వరకు 21 సార్లు ఈ ప్రక్రియ విజయవంతంగా జరిగింది.

CR Reddy

CR Reddy

Next Story