సోషల్‌ మీడియాకు ప్రధాని మోడీ సైన్‌ ఆఫ్‌

సోషల్‌ మీడియాకు ప్రధాని మోడీ సైన్‌ ఆఫ్‌
x
Highlights

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సోషల్‌ మీడియాకు ఈ రోజు గుడ్‌బై చెప్పేశారు. ఆయన గతంలో చెప్పినట్టు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక్కరోజు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సోషల్‌ మీడియాకు ఈ రోజు గుడ్‌బై చెప్పేశారు. ఆయన గతంలో చెప్పినట్టు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక్కరోజు తన సోషల్ మీడియా ఖాతాల నుంచి వైదొలిగారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. దేశ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నారీ శక్తి సాధించిన విజయాలకు, వారి స్ఫూర్తికి నా సెల్యూట్ అని మోడీ ట్వీట్ చేశారు.. కొన్ని రోజుల క్రితం నేను చెప్పినట్టు ఈ రోజు మొత్తం నేను సోషల్ మీడియా అకౌంట్ల నుంచి సైన్ ఆఫ్ అవుతున్నానని ట్వీట్ ద్వారా తెలిపారు. ఏడుగురు మహిళల విజయగాథలను నా సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా షేర్‌ చేస్తానని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

తన సోషల్‌ మీడియా ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లను అందరిలోనూ స్ఫూర్తిని నింపే మహిళలకి మహిళా దినోత్సవం రోజులన అంకితం ఇస్తున్నానని స్పష్టం చేశారు. ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోషల్‌ మీడియా ఖాతాలను ఏ మహిళల జీవితాలైతే అందరిలోనూ స్ఫూర్తిని నింపుతాయో, వారు చేసే పనులు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయో వారికి అంకితం ఇస్తున్నానని తెలిపారు. అలాంటి మహిళల నిజ జీవిత గాథలు లక్షలాది మందికి ప్రేరణగా నిలుస్తాయి' అని ఇటీవల ట్వీట్‌ చేశారు.'మీరు అలాంటి మహిళ అయినా, లేదంటే అలాంటి స్ఫూర్తిని రగిల్చే మహిళల గురించి మీకు తెలిసినా వారి జీవిత గాథల్ని #SheInspiresUs అన్న హ్యాష్‌ ట్యాగ్‌తో షేర్‌ చేయండి' అని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో చాలామంది మహిళలను వారి విజయగాథల్ని మోదీకి షేర్‌ చేశారు. వాటిలో ఏడుగురి మహిళల విజయగాథలను నేడు తన సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా షేర్‌ చేయనున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories