PM-Cares Fund donations : పిఎం-కేర్స్ ఫండ్‌కు మార్చి 31 వరకు వచ్చిన విరాళాలు చూస్తే..

PM-Cares Fund donations : పిఎం-కేర్స్ ఫండ్‌కు మార్చి 31 వరకు వచ్చిన విరాళాలు చూస్తే..
x
Highlights

కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి మోడీ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో ఏర్పాటు పిఎం-కేర్స్ ఫండ్‌ ను ఏర్పాటు

కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి మోడీ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో ఏర్పాటు పిఎం-కేర్స్ ఫండ్‌ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సినీ రాజకీయ ప్రముఖులు వివిధ కార్పొరేట్ సంస్థలతోపాటు పలు స్వచ్చంధ సంస్థలు భారీగా విరాళాలు అందించాయి. దీంతో మార్చి 31 వరకు.. 3,076 కోట్ల రూపాయలు విరాళాలుగా లభించాయి. పిఎమ్-కేర్స్ ఫండ్ వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఆడిట్ నివేదికలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. మార్చి 31 వరకు భారతదేశం మరియు విదేశాల నుండి ఈ మొత్తం విరాళాలు వచ్చాయి. పిఎమ్ కేర్స్ సైట్‌లో బహిరంగంగా చేసిన ఆడిట్ నివేదిక ప్రకారం, పిఎం-కేర్స్ ఫండ్‌తో అనుసంధానించబడిన బ్యాంక్ ఖాతా యొక్క చివరి బ్యాలెన్స్ రూ .30,76,62,58,096 గా ఉంది. అయితే, మార్చి తరువాత వచ్చిన విరాళాల లెక్క మాత్రం ఇంకా వెల్లడించలేదు.

కోవిడ్ -19 తో పోరాడటానికి ఏర్పాటు చేసిన పిఎం-కేర్స్ ఫండ్‌ లో మరింత పారదర్శకత కోరుతూ ప్రతిపక్షాలు కోర్టులో పలు పిటిషన్లు వేశాయి. పిఎమ్ కేర్స్ నిధులు లెక్కచెప్పాలంటు డిమాండ్ చేశాయి. అయితే సుప్రీం కోర్టు మాత్రం ఈ పిటిషన్ కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. పిఎం మోడీ మరియు ప్రభుత్వంలోని కొంతమంది ఉన్నతాధికారులు ఈ నిధికి ధర్మకర్తలుగా ఉన్నారు. దేశవ్యాప్తంగా కరోనావైరస్ సంరక్షణ కోసం 'మేడ్ ఇన్ ఇండియా' లో భాగంగా వెంటిలేటర్లను సేకరించడానికి మే నెలలో పిఎం-కేర్స్ ఫండ్ నుండి రూ .3,000 కోట్లు కేటాయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories