PMAY: కోటి కుటుంబాలకు పక్కా ఇళ్లు.. కేంద్రం నిర్ణయం..!

PM Awas Yojana 2025 Free House Application Benefits
x

PMAY: కోటి కుటుంబాలకు పక్కా ఇళ్లు.. కేంద్రం నిర్ణయం..!

Highlights

PMAY: సొంతింట కల తీరని ఎంతోమంది ఇంకా ఈ దేశంలో ఉన్నారు. పేద తరగతి మాత్రమే కాదు మధ్య తరగతి వాళ్లు కూడా ఇళ్ల కొనుగోలు రేట్లు ఎక్కువ కావడంతో సొంతింటి కలను నెరవేర్చుకోలేకపోతున్నారు.

PMAY: సొంతింట కల తీరని ఎంతోమంది ఇంకా ఈ దేశంలో ఉన్నారు. పేద తరగతి మాత్రమే కాదు మధ్య తరగతి వాళ్లు కూడా ఇళ్ల కొనుగోలు రేట్లు ఎక్కువ కావడంతో సొంతింటి కలను నెరవేర్చుకోలేకపోతున్నారు. ఇలాంటి వారికోసం ఇప్పుడు పీఎమ్ ఆవాస్ యోజనా, 2025 వచ్చింది. దీనిలో అప్లై చేసుకుంటే ఒక పక్కా ఇల్లు మీకు సొంతం అవుతుంది. ఈ స్కీమ్‌కు సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..

మీరు సిటీలో ఒక పక్కా ఇల్లు నిర్మించుకోవాలని కుంటున్నారా? అయితే మీరు దానికి తగినంత డబ్బును సమకూర్చుకోలేకపోతున్నారా. అయితే మీకొక గుడ్ న్యూస్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ మీ కలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో ఇళ్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చింది.

పిఎమ్ఎవై–యు 2.0 కింద 2024 బడ్జెట్‌లో రాబోయే ఐదు సంవత్సరాల్లో ఒక కోటి కుటుంబాలకు ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ని తీసుకొచ్చింది. ఆర్దిక సాయం, వడ్డీ సబ్సిడీ, అఫర్టబుల్ హౌసింగ్ వంటి ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ స్కీమ్‌ ఎలా అప్లై చేయాలో వివరాలు చూద్దాం.

స్కీమ్ బెనిఫిట్

ఈ స్కీమ్‌ ప్రకారం, భూమి ఉంటే, ఇల్లు కట్టుకోడానికి రూ. 2.5 లక్షల వరకు ఆర్ధిక సహాయం పొందవచ్చు. అదేవిధంగా వడ్డీ సబ్సిడీ విషయానికొస్తే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం ద్వారా, హోమ్ లోన్ వడ్డీపై రూ. 2.67 లక్షల వరకు సబ్సిడి పొందవచ్చు. దీనివల్ల లోన్ల భారం తగ్గుతుంది. అదేవిధంగా భూమి లేని వారికి తక్కువ ధరలకు ఇళ్లను అందిస్తుంది. లేదంటే చాలా తక్కువ అద్దెకు ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను కేటాయిస్తుంది.

భారతదేశంలో ఎక్కడా పక్కా ఇళ్లు లేని వారు PMAY-U 2.0కి అర్హులు. అంతేకాదు ఆర్ధికంగా బలహీన వర్గాలు, అంటే వార్షిక ఆదాయం రూ. 3 లక్షల వరకు ఉండే వాళ్లు ఈ స్కీమ్‌కు అప్లై చేసుకోవచ్చు. అలాగే లోయర్ ఇన్‌కమ్ గ్రూప్ అంటే వార్షికాదాయం రూ. 6 లక్షల వరకు ఉండే కటుంబాలు, అదేవిధంగా వార్షికాదాయం రూ. 9 లక్షల వరకు ఉండే వాళ్లు మాత్రమే అర్హులు. అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఈ స్కీమ్‌ను అప్లై చేయాలనుకుంటే వారు గతంతో ఎటువంటి కేంద్ర, రాష్ట్ర ఇళ్లను అందుకుని ఉండకూడదు.

అదేవిధంగా వింతతువులు, ఒంటరిమహిళలు, లింగమార్పిడి వ్యక్తులు, వికలాంగులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనారిటీకి చెందిన వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే వీధి వ్యాపారాలు, మురికి వాడల నివాసితులు, అంగన్వాడీ కార్మికులు, ఎమ్ స్వానిధి , విశ్వకర్మ పథకాలకు సంబంధించన వ్యక్తులు కూడా అర్హులు.

ఎలా అప్లై చేయాలి?

మీరు పక్కా ఇళ్ల కోసం అప్లై చేయాలనుకుంటే PMAY-U పోర్టల్ విజిట్ చేయాలి. ఆ తర్వాత అప్లై ఫర్ PMAY-U 2.0 ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అక్కడ మీ వివరాలను ఇవ్వండి. తర్వాత మీ అర్హత నిర్ధారించడానికి ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. మీ ఫోన్‌కు ఒటీపీ వస్తే మీ వివరాలు ఎంటర్ అయినట్లే. ఇక్కడే మీ ఆధార్ నెంబర్, ఇన్ కమ్ సర్టిఫికెట్, కాస్ట్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories