Plea in SC to Extend Moratorium: మారటోరియం పొడిగించక తప్పదు.. సుప్రీంలో పిటిషన్

Plea in SC to Extend Moratorium: మారటోరియం పొడిగించక తప్పదు.. సుప్రీంలో పిటిషన్
x
Highlights

Plea in SC to Extend Moratorium: కరోనా కారణం వల్ల విధించిన మారటోరియం గడువు ముగుస్తుండటంతో దాన్ని ఈ ఏడాది చివరి వరకు పొడిగించాలని సుప్రీంలో పిటిషన్ దాఖలైంది.

Plea in SC to Extend Moratorium: కరోనా కారణం వల్ల విధించిన మారటోరియం గడువు ముగుస్తుండటంతో దాన్ని ఈ ఏడాది చివరి వరకు పొడిగించాలని సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. వాస్తవంగా చూస్తే లాక్ డౌన్ కన్నా అన్ లాక్ లోనే పరిస్థితి ఘోరంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ కేసులు, వందల్లో పాజిటివ్ లు. ఎక్కడ ఏముందో భయం... కనీసం బయటకు కాలు తీసి పెట్టి తిరిగి క్షేమంగా ఇంటికి రావడమంటే మరో జన్మఎత్తినంతవుతుంది. రెండు నెలలుగా క్షేత్రస్థాయిలో ఇదే పరిస్థితి ఉంది. కనీసం చిన్నస్థాయి వ్యాధి వచ్చినా ఎక్కడా చికిత్స లేదు. అన్నీ కోవిద్ ఆస్పత్రులే. ఏ ఉద్యోగానికి సంబంధించిన కార్యాలయం చూస్తే 50 నుంచి 60 శాతం పాజిటివ్ సోకిన వారే. దీంతో ఆఫీసుకే కాదు.. ఇంటి నుంచి కాలుబయట పెట్టలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంకులు ఇతర రుణాలక సంబంధించి ఎటువంటి చెల్లింపులు చేయలేని పరిస్థితి. అందువల్ల ఈ ఏడాది చివరి వరకు మారటోరియంను పొడిగించాలని సుప్రీంలో పిటిషన్ దాఖలయ్యింది.

కరోనా క్లిష్ట సమయంలో సాధారణ పౌరులు, మధ్యతరగతి ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారికి ఉపశమనం కలిగించేలా సుప్రీంకోర్టులో ఓ వ్యాజ్యం దాఖలైంది. ఆగస్ట్‌ 31తో ముగియనున్న మారటోరియం గడువును కోవిడ్‌ దృష్ట్యా డిసెంబర్‌ 31 వరకు పొడించాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు న్యాయవాది విశాల్‌ తివారీ తన పిటిషన్‌ పలు కీలక అంశాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. కరోనా వైరస్‌ ధాటికి ప్రజల జీవితాలు అతలాకుతలం అయ్యాయని వివిధ అవసరాల కోసం తీసుకున్న లోన్లు చెల్లించే పరిస్థితిలో వారు లేరని పేర్కొన్నారు. లాక్‌డౌక్‌ కారణంగా పరిశ్రమలు మూతపడటంతో కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోయారని వివరించారు. ఈ నేపథ్యంలో మారిటోరియం గడువును డిసెంబర్‌ 31 వరకు పెంచేలా కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్‌బీఐ, వివిధ బ్యాంకులను ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై వచ్చే వారం ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశం ఉంది.

కాగా బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్ల్‌ను తిరిగి చెల్లించేందుకు మారటోరియం రూపంలో కేంద్ర ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. ఆ గడువు కాస్తా ఆగస్ట్‌ 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువును మరికొంత కాలం పొడించాలని పలు వర్గాల నుంచి డిమాండ్‌ వినిపిస్తోంది. అయితే బ్యాంకింగ్‌ రంగాలు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా ఎస్‌బీఐ మారటోరియం పొడిగింపుకు ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు కావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై సుప్రీం, కేంద్ర ప్రభుత్వాల స్పందన ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తిరేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories