ఆవు కడుపులో 52 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించిన వైద్యులు

ఆవు కడుపులో 52 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించిన వైద్యులు
x
Highlights

ఓ ఆవు అనారోగ్యంగా ఉందని వెటర్నరీ వైద్యశాలకు యజమాని తీసుకొచ్చాడు. దానిని పరీక్షించిన వైద్యులు దాని కడుపులో సుమారు 52 కిలోల వ్యర్థలు ఉన్నట్టు గుర్తించారు.

ఓ ఆవు అనారోగ్యంగా ఉందని వెటర్నరీ వైద్యశాలకు యజమాని తీసుకొచ్చాడు. దానిని పరీక్షించిన వైద్యులు దాని కడుపులో సుమారు 52 కిలోల వ్యర్థలు ఉన్నట్టు గుర్తించారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఏనిమల్ సైన్సెస్ యూనివర్సిటీ వైద్యులు గోవు కడుపులోని 52 కీలోల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలిగించారు. గోవు కడుపులో ఉన్న వ్యర్థాలను వైద్యులు గుర్తించారు. దాదాపు 5గంటల పాటు శస్త్ర చికిత్స చేసి వైద్యులు వాటిని తొలిగించారు. అంతే కాకుండా ఆవు కడుపులో రెండు స్ర్కూలు, నాణెం కూడా ఉన్నట్లు గుర్తించారు. శస్త్ర చికిత్స చేసిన వైద్యలు ఆవుకు కొన్ని రోజుల విశ్రాంతి ఇవ్వాలని యజమానికి డాక్టర్ వేలవన్ సూచించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories