ప్లాస్మా థెరపీపై కేంద్రం సంచలన ప్రకటన

ప్లాస్మా థెరపీపై కేంద్రం సంచలన ప్రకటన
x
Highlights

భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24...

భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1543 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. భారత్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 29,435కి చేరుకుంది. వారిలో 6868మంది కోలుకున్నారని ఆ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ప్లాస్మా థెరపీ చికిత్స ద్వారా కరోనా నయం అవుతుందడానికి ఆధారాలు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఉందని తెలిపింది. ప్లాస్మీ థెరపీ సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా అధ్యయనం ప్రారంభించిందని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories