లాఠీ ఛార్జ్ ప్లాన్ ప్రకారం చేసినదే : స్టాలిన్

లాఠీ ఛార్జ్ ప్లాన్ ప్రకారం చేసినదే : స్టాలిన్
x
Highlights

చెన్నైలో సిఎఎ వ్యతిరేక ర్యాలీలో నిరసనకారులపై లాఠీ ఛార్జ్ చేశారని డిఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్ ఆరోపించారు. ఫిబ్రవరి 14 ను బ్లాక్ డేగా ఆయన అభివర్ణించారు....

చెన్నైలో సిఎఎ వ్యతిరేక ర్యాలీలో నిరసనకారులపై లాఠీ ఛార్జ్ చేశారని డిఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్ ఆరోపించారు. ఫిబ్రవరి 14 ను బ్లాక్ డేగా ఆయన అభివర్ణించారు. అంతేకాదు ఇది ప్రభుత్వ ప్రణాళికాబద్ధమైన దాడి అని ఆయన ఆరోపించారు.నిరసనకారులపై ఉన్న కేసులన్నీ ఉపసంహరించుకోవాలని, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసన వ్యక్తం చేశారు. కొంతమంది నిరసనకారులను నిరసన ప్రదేశం నుండి బలవంతంగా తరలించే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు, నిరసన కారులకు మధ్య గందరగోళానికి దారితీసింది. దాంతో లాటి ఛార్జి జరిగినట్టు తెలుస్తోంది. నిరసనకారుల తోపాటు

పోలీసులు కూడా గాయపడినట్లు వార్తలు వచ్చాయి.. నిరసనకారులు రాళ్ళు రువ్వడంతో మహిళా డిప్యూటీ కమిషనర్, ఇద్దరు మహిళా సిబ్బంది మరియు సబ్ ఇన్స్పెక్టర్తో సహా నలుగురు పోలీసులు గాయపడ్డారు.

ఈ ఘటనలో కొంతమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. తదనంతరం, వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మరికొంతమంది స్టేషన్ ఎదుట గుమిగూడారు. అయినా పరిస్థితి అదుపులోనే ఉందని పోలీస్ అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories