Plane Crash: స్వీడన్‌లో ఘోర విమాన ప్రమాదం... 9 మంది దుర్మరణం

Plane carrying skydivers crashes in Sweden, Killing Nine
x

Plane Crash in Sweden

Highlights

Plane Crash: స్వీడన్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో తొమ్మిది మంది స్కైడైవర్లు మరణించారు.

Plane Crash: స్వీడన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగి తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. స్వీడన్ దేశరాజధాని స్టాక్ హోమ్‌కు దాదాపు 160 కి.మీ. దూరంలో ఉన్న ఒరెబ్రో ఎయిర్‌పోర్టు సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ఒరెబ్రో ఎయిర్‌పోర్టు నుంచి ఓ స్మాల్ ప్రొపెల్లర్ స్కైడైవింగ్ విమానం గాల్లోకి ఎగిరింది. అందులో 8 మంది స్కై డైవర్లు, ఒక పైలట్ ఉన్నారు. ఐతే టేకాఫ్ అవుతున్న సమయంలోనే ఆ విమానం కూలిపోయింది. రన్‌వే పక్కనే పడిపోయింది. విమాన ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.

విమానం ముక్కలై పూర్తిగా కాలిపోయింది. కొందరి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి. ఘటనా స్థలానికి రెస్క్యూ బృందాలు వెళ్లేసరికి అప్పటికే 8 మంది మరణించారు. ఒకరు మాత్రమే ప్రాణాలతో ఉన్నట్లు తెలిసింది. తీవ్రగాయాల పాలైన అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. 2019లో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. 9 మంది స్కైడైవర్లతో వెళ్తున్న విమానం యుమీ ఎయిర్‌పోర్టు బయట కూలిపోయింది.


Show Full Article
Print Article
Next Story
More Stories