దూసుకొస్తున్న ఫణి తుపాన్.. ఈ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు..

దూసుకొస్తున్న ఫణి తుపాన్.. ఈ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు..
x
Highlights

బంగాళాఖాతంలో ఏర్పడిన దూసుకొస్తున్న ఫణి తుపాన్.. ఈ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు.. మరింత బలపడుతోంది. దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల...

బంగాళాఖాతంలో ఏర్పడిన దూసుకొస్తున్న ఫణి తుపాన్.. ఈ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు.. మరింత బలపడుతోంది. దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 30 నుంచి 31 డిగ్రీల వరకు ఉండడంతో తుపాను తీవ్రత పెరుగుతోంది. రానున్న 12 గంటల్లో ఇది తీవ్ర తుపానుగా మారి తమిళనాడు-కోస్తాంధ్ర తీరాల వద్ద కేంద్రీకృతం కానుంది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారి తీర ప్రాంతాలపై విరుచుకుపడనుంది. మంగళవారం సాయంత్రానికి తీరాన్ని చేరనుంది. ఈనెల 30 సాయంత్రానికి ఫణి తుఫాను దిశ మార్చుకుని ఈశాన్యంగా పయనిస్తుందని ఐఎండీ తెలిపింది.

ఏప్రిల్ 30 నుంచి మే 2 వరకు తుపాను ప్రభావం ఉండనుంది. అతితీవ్ర తుఫాను తీరానికి దగ్గరగా వస్తే ఏప్రిల్ 30, మే 1వ తేదీల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాల్లో విస్తారంగావర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని.. ముందస్తుగా ఇందుకోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.

Show Full Article
Print Article
Next Story
More Stories