ప్రధాని మోదీ హత్యకు పీఎఫ్‌ఐ కుట్ర!.. వెలుగులోకి సంచలన విషయాలు..

Narendra Modi: NIA దాడుల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి.

Arun Chilukuri
Published on: 24 Sept 2022 12:52 PM IST
PFI had set up a Training Camp to Target PM Modi
X

ప్రధాని మోదీ హత్యకు పీఎఫ్‌ఐ కుట్ర!.. వెలుగులోకి సంచలన విషయాలు..

Narendra Modi: NIA దాడుల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రముఖుల హత్యకు PFI కుట్ర పన్నినట్టు NIA అధికారులు సమాచారం సేకరించారు. ఈ ఏడాది జులై 12న ప్రధాని పాట్నా పర్యటన సమయంలో అల్లర్లకు కుట్ర జరిగినట్టు వారు గుర్తించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేసేందుకు పీఎఫ్‌ఐ కుట్ర పన్నినట్లు తెలిసింది. ఈ దాడులు చేసేందుకు పలువురికి శిక్షణ కూడా ఇచ్చినట్లు వివరాలు సేకరించారు. యూపీకి చెందిన మరికొందరు ప్రముఖులపై దాడులకు స్కెచ్‌ వేసినట్టు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన NIA.. ఢిల్లీ అల్లర్లతో సహా ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాప్తు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో సోదాలు చేపట్టి 45 మందిని అరెస్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పలువురు అరెస్టయ్యారు. మరోవైపు NIA దాడుల తర్వాత PFI ఆర్థిక కార్యకలాపాలపై ఈడీ ఆరా తీస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story