దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు

దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
x
Highlights

ఆయిల్ కంపెనీలు మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. పెట్రోల్ ధరను శుక్రవారం 57 పైసలు పెంచారు. అదే సమయంలో, డీజిల్ ధర 59 పైసలు పెరిగింది. చమురు...

ఆయిల్ కంపెనీలు మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. పెట్రోల్ ధరను శుక్రవారం 57 పైసలు పెంచారు. అదే సమయంలో, డీజిల్ ధర 59 పైసలు పెరిగింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇంధన ధరలను మార్చడం ఇది వరుసగా ఆరో రోజు. దీనికి ముందు, చమురు ధరలలో సుమారు 82 రోజులలో ఎటువంటి మార్పు లేదు. అయితే గత ఆదివారం నుంచి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రేట్లను పెంచుతుం ఉన్నాయి. దీంతో తాజా పెంపు ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర 57 పైసలు పెరిగి లీటరుకు 74.57 రూపాయలకు చేరుకుంది.

అదే సమయంలో డీజిల్ ధర కూడా లీటరుకు రూ .72.22 నుంచి రూ .72.81 కు పెరిగింది. అలాగే ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ .81.53 కు చేరుకుంది. అదే సమయంలో డీజిల్ ధర లీటరుకు 71.48 రూపాయలకు చేరుకుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లను ఆయిల్ కంపెనీలు పెంచాయి. అయితే స్థానిక అమ్మకపు పన్ను లేదా విలువ ఆధారిత పన్నులను బట్టి ప్రతి రాష్ట్రంలో రేట్లు మారుతూ ఉండే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories