Supreme Court: సుప్రీం కోర్టులో స్త్రీ, పురుషులకు ఒకే వివాహ వయస్సు ఉండాలని పిటిషన్

Petition in Supreme Court to Make Marriageable Age Equal for Men and Women
x

Supreme Court: సుప్రీం కోర్టులో స్త్రీ, పురుషులకు ఒకే వివాహ వయస్సు ఉండాలని పిటిషన్

Highlights

Supreme Court: పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు.. అది పార్లమెంట్ పరిధిలోని అంశమని తేల్చిచెప్పిన సుప్రీం

Supreme Court: దేశంలో పురుషులకు, మహిళలకు కనీస వివాహ వయసు ఒకే విధంగా ఉండాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కనీస వివాహ వయసుపై ప్రముఖ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. పురుషుల వివాహ వయసు 21 అయినప్పుడు, మహిళల వివాహ వయసును కూడా 21 ఏళ్లు అని ప్రకటించాలని.. ఆ మేరకు చట్ట సవరణ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్ధీవాలా బెంచ్ విచారణ చేపట్టింది. స్త్రీ, పురుషుల కనీస వివాహ వయసు అంశం పార్లమెంటు పరిధిలోకి వస్తుందని, దీంట్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. రాజ్యాంగానికి కేవలం సుప్రీంకోర్టు ఒక్కటే రక్షణ కల్పించదని తేల్చిచెప్పింది. చట్ట సవరణ చేస్తే మహిళలకంటూ ఓ వివాహ వయసు లేకుండా పోతుందని సుప్రీం కోర్టు అభప్రాయపడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories