Taj Mahal: తాజ్‌మహల్‌లో మూసి ఉన్న 22 గదుల్లో ఏమున్నాయ్‌?

Petition in Allahabad High Court to Open 22 Rooms in Taj Mahal
x

Taj Mahal: తాజ్‌మహల్‌లో మూసి ఉన్న 22 గదుల్లో ఏమున్నాయ్‌?

Highlights

Taj Mahal: తాజ్‌మహల్‌ 22 గదులు తెరిపించాలంటూ పిటిషన్

Taj Mahal: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ ప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్ మహల్ ఒకటి. మెుఘల్‌ చక్రవర్తి షాజహాన్‌, ముంతాజ్‌ ప్రేమకు చిహ్నాంగా తాజ్‌మహల్‌ ను చెప్పుకుంటారు. అయితే ఈ తాజ్‌మహల్‌ ముంతాజ్‌ స్మారకం కాదని ఒకప్పటి హిందూ దేవాలయమని మరో వాదన ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో దాని గుట్టు విప్పాలంటూ అలహాబాద్‌ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు అయింది. నాలుగు అంతస్థుల తాజ్ మహల్‌లోని కింది రెండు అంతస్థుల్లోనూ ఉన్న గదుల్లో సుమారు 22 గదులను శాశ్వతంగా మూసేశారని, తాజ్‌ మహల్‌లో తాళం వేసి ఉన్న 22 గదుల తలుపులను ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా తెరిపించాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌ లో పిటిషన్ దాఖలైంది. ఈ గదుల్లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి మూసి ఉన్న గదుల తలుపులు తెరవాలని పిటిషన్‌లో కోరారు. ఇందుకోసం ఏఎన్ఐ చేత నిజ నిర్ధారణ జరిపించాలని పిటిషనర్ పేర్కొన్నారు.

ఈ కమిటీ నివేదికను కోర్టుకు సమర్పించేలా, కోర్టు సమక్షంలోనే ఆ నివేదికను బహిర్గతం చేసేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. దశాబ్దాల కాలంగా మూసి ఉన్న ఆ గదుల లోపల హిందూ దేవుళ్ల విగ్రహాలు ఉన్నట్లు అనేక మంది చరిత్రకారులు, కోట్లాది మంది హిందువులు విశ్వసిస్తున్నారన్నారు. ఆ గదుల్లోనే పరమేశ్వరుడు కొలువుదీరి ఉన్నారని నమ్ముతున్నట్లు పిటిషనర్ కోర్టుకు తెలిపారు. కొందరు చరిత్రకారులు, హిందూ సంస్థలు తాజ్ మహల్‌ ఒక పురాతన శివాలయం అని వాదిస్తున్నారని కూడా పిటిషనర్ పేర్కొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories