ఆందోళ‌న వ‌ద్దు.. హామీ ఇస్తున్నా: ప్రధాని మోదీ

ఆందోళ‌న వ‌ద్దు.. హామీ ఇస్తున్నా: ప్రధాని మోదీ
x
నరేంద్ర మోదీ
Highlights

పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. బిల్లుకు వ్యతిరేకంగా అసోం, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు...

పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. బిల్లుకు వ్యతిరేకంగా అసోం, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చడంతో శాంతిభద్రతలపై ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో దాదాపు 5వేల పారామిలటరీ దళాలను కేంద్రం ఈశాన్య రాష్ట్రాల్లో మోహరించింది.

దీంతో వారికి ప్రధాని నరేంద్ర మోదీ హామీనిచ్చారు. నేనున్నానంటూ అభయం ఇచ్చారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదికగా అస్సాం ప్రజలకు హామీ ఇచ్చారు. అస్సాం సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు హామీ ఇస్తున్నాన‌ని, క్యాబ్‌తో ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని మోదీ అన్నారు. మీ హ‌క్కుల‌ను, విశిష్ట గుర్తింపును, మీ అద్భుత సంస్కృతిని ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని హామీ ఇస్తున్నట్లు ప్రధాని చెప్పారు. అస్సాం సంస్కృతీ, సాంప్రదాయాలు క‌ల‌కాలం వ‌ర్థిల్లుతాయ‌న్నారు. రాజ్యాంగంలోని క్లాజ్ 6 ప్రకారం అస్సాం ప్రజ‌ల రాజ‌కీయ‌, భాష‌, సాంస్కృతిక‌, భూమి హ‌క్కుల‌ను సంర‌క్షించేందుకు త‌మ ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ఆయ‌న తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories