Pension:పెన్షన్ త్వరలో భారీగా పెరగనుందా? కేంద్రం కీలక ప్రకటన

Pension:పెన్షన్ త్వరలో భారీగా పెరగనుందా? కేంద్రం కీలక ప్రకటన
x

Pension:పెన్షన్ త్వరలో భారీగా పెరగనుందా? కేంద్రం కీలక ప్రకటన

Highlights

పెన్షన్: త్వరలోనే పెన్షన్ పెరుగుతుందన్న వార్తలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇందిరా గాంధీ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ (IGNOAPS) కింద ప్రస్తుతం అందిస్తున్న మొత్తాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది.

ఈ పథకం ద్వారా నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్‌ (NSAP) సాయంతో దేశవ్యాప్తంగా వృద్ధులకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నారు. 60 నుంచి 79 సంవత్సరాల వయసున్నవారికి నెలకు రూ.200, 80 ఏళ్లు పైబడినవారికి రూ.500 కేంద్రం నుంచి పెన్షన్ ఇస్తోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అదనంగా రూ.50 నుంచి రూ.3,800 వరకు టాప్-అప్ అందిస్తుండటంతో, అనేక ప్రాంతాల్లో పెన్షన్ మొత్తం నెలకు రూ.1,000 దాటుతోంది.

వృద్ధాప్య పెన్షన్ నిధులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. గత ఐదు సంవత్సరాలుగా ఈ పథకానికి నిధులు విడుదల చేసినప్పటికీ, రాష్ట్రాలవారీగా వివరాలు వెల్లడించలేదు. 2021-22 నుంచి రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఎస్‌సీ, ఎస్‌టీ లబ్ధిదారులకు ప్రత్యేక నిధులు కేటాయించారు.

అయితే, సీనియర్ సిటిజన్లు నెలకు రూ.1,000 లేదా రూ.1,500గా పెంచాలని కోరుతున్నప్పటికీ, ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని లోక్‌సభలో స్పష్టం చేసింది. అంటే ప్రస్తుత పెన్షన్ మొత్తాలే కొనసాగుతాయి.

ఈ స్కీమ్ ఉద్దేశ్యం పేదరిక రేఖకు దిగువన ఉన్న వృద్ధులకు ఆర్థిక భద్రత కల్పించడం. రాష్ట్రాల టాప్-అప్‌లతో కొంత సహాయం అందుతున్నా, పెరుగుతున్న జీవన వ్యయాల దృష్ట్యా పెన్షన్ పెంచాలని డిమాండ్‌ కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories