పెజావర మఠాధిపతి శివైక్యం

పెజావర మఠాధిపతి శివైక్యం
x
Highlights

కర్ణాటక రాష్ట్రంలో ఉడిపి అష్ట మఠాల్లో ఒకటైనా పెజావర మఠం మఠాధిపతి విశ్వేశతీర్థ స్వామి (88) శివైక్యం చెందారు.

కర్ణాటక రాష్ట్రంలో ఉడిపి అష్ట మఠాల్లో ఒకటైనా పెజావర మఠం మఠాధిపతి విశ్వేశతీర్థ స్వామి (88) శివైక్యం చెందారు. అనారోగ్యం కారణంగా మణిపాల్‌ కస్తూర్భా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి స్వామీజీ అపస్మారక స్థితికి వెళ్లడంతో మఠానికి చెందని వారి విన్నపం మేరకు స్వామీజీని తెల్లవారుజామున మఠానికి తరలిచారు. చికిత్స తీసుకుంటూ మఠంలోనే స్వామీజీ కన్నుమూశారు. ఈ మేరకు విశ్వేశతీర్థ స్వామీజీ తుదిశ్వాస విడిచారని ఉడిపి ఎమ్మెల్యే కే రఘుపతి భట్ తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి శ్రీకృష్ణమఠానికి చేరుకుని విశ్వేశతీర్థ స్వామీజీని పార్థివదేహం దర్శించుకున్నారు.

కాగా.. విశ్వేశతీర్థ స్వామీజీని ఈ నెల 20న ఆసుపత్రిలో చేర్చారు. శ్వాస పీల్చుకోవడం ఇబ్బందులు తలెత్తడంతో ఆసుపత్రిలో చేర్చినట్లు మఠానికి చెందిన వారు తెలిపారు. న్యుమోనియా చికిత్సను స్వామీజీకి అందించినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన ఆరోగ్యం క్షిణించింది. చికిత్సకు పూర్తిగా సహాకరించకపోవడంతో పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డిస్‌ఫంక్షన్ అని తేల్చారు. దీంతో స్వామీజీ ఆరోగ్యం విషమంగా మారడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్పృహ కోల్పాయారు. స్వామీజీ కోరిక మేరకు మఠానికి తరలించారు.

మఠాథిపతి విశ్వేశ తీర్ధ స్వామీజీ మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కర్ణాటక సీఎం యడియూరప్ప స్వామీజీ మృతిపై విచారం వ్యక్తం చేశారు. పలువురు పీఠాధిపతులు జావర్ మఠాధిపతి విశ్వేశ తీర్థ స్వామి పరమపదించడం పట్ల విచారం వ్యక్తం చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories