కరోనా వ్యాక్సిన్‌పై రాజకీయాలు

కరోనా వ్యాక్సిన్‌పై రాజకీయాలు
x
Highlights

కరోనా వ్యాక్సిన్ పై రాజకీయాలు రాజుకున్నాయి. పార్టీలు చివరకు ఈ కరోనా క్రైసిస్ ను కూడా రాజకీయానికి వాడేసుకుంటున్నాయి. వ్యాక్సిన్ పై రకరకాల ఊహాగానాలు సాగుతున్న నేపధ్యంలో బీజేపీ ఓ అడుగు ముందుకేసి బీహార్ ఎన్నికలలో దీనిని ఒక అస్త్రంగా వాడేసింది.

కరోనా వ్యాక్సిన్ పై రాజకీయాలు రాజుకున్నాయి. పార్టీలు చివరకు ఈ కరోనా క్రైసిస్ ను కూడా రాజకీయానికి వాడేసుకుంటున్నాయి. వ్యాక్సిన్ పై రకరకాల ఊహాగానాలు సాగుతున్న నేపధ్యంలో బీజేపీ ఓ అడుగు ముందుకేసి బీహార్ ఎన్నికలలో దీనిని ఒక అస్త్రంగా వాడేసింది. బీహార్ లో కరోనా వ్యాక్సిన్ ను ఎన్నికల వాగ్దానంగా మార్చేసింది. తమ పార్టీకి ఓటేస్తే వ్యాక్సిన్ ఎపుడొచ్చినా బీహార్ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయిస్తామంటూ హామీ ఇచ్చేసింది.

బీజేపీ హామీపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండి పడింది. ఇప్పట్లో రాని వ్యాక్సిన్ పై అర్ధం లేని హామీలు ఎలా గుప్పిస్తారంటూ రాహుల్ ఫైర్ అయ్యారు. బీహార్ లో బీజేపీ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఏకంగా ఈసీకి కంప్లయింట్ చేశారు.

ఇటు దక్షిణాదినా వ్యాక్సిన్ రాజకీయాలు షురూ అయ్యాయి. తమిళనాడు సీఎం పళని స్వామి కూడా తమిళనాడు ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా వేయిస్తామంటూ ముందుకొచ్చారు. తమిళనాడుకు కూడా వచ్చేఏడాది ఎన్నికలున్న నేపధ్యంలో ఈ హామీలు వివాదంగా మారాయి. మరోవైపు అసలు కరోనా వ్యాక్సిన్ రాడానికి ఏడాది సమయం పడుతుందంటూ సీసీఎంబీ డైరక్టర్ రాకేష్ మిశ్రా బాంబు పేల్చారు. కరోనా కేసులు తగ్గాయికానీ తీవ్రత తగ్గలేదని ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలనీ ఆయన సూచించారు.

రాజకీయ పార్టీలు హామీలు ఇలాగుంటే... మరోవైపు CCMB సంచలన ప్రకటన చేసింది. ఏడాది తర్వాతే కరోనా వ్యాక్సిన్ వస్తుందని CCMB డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తేల్చిచెప్పారు. కరోనా తీవ్రత ఇంకా తగ్గలేదన్న CCMB.... అజాగ్రత్తగా ఉంటే మాత్రం ముప్పు తప్పదన్నారు. మాస్క్ ధరించడం... భౌతిక దూరం పాటించడం చేయకపోతే.... మళ్లీ లాక్‌‌డౌన్ విధించే పరిస్థితి రావొచ్చని CCMB హెచ్చరించింది. అన్ని దేశాల్లోనూ కరోనా వ్యాక్సిన్‌పై ఇంకా ట్రయల్సే జరుగుతున్నాయన్న CCMB.... కోట్ల మందికి వ్యాక్సిన్ తేవడం కష్టమేనన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories