PAN Aadhaar Linking: మార్చి 31 లో పాన్‌తో ఆధార్ లింక్ అవ్వాలి.. లింక్ అయిందో లేదో ఇలా తెలుసుకోండి

PAN Aadhaar Linking: మార్చి 31 లో పాన్‌తో ఆధార్ లింక్ అవ్వాలి.. లింక్ అయిందో లేదో ఇలా తెలుసుకోండి
x
Highlights

మార్చి 31, 2020 నాటికి ఆధార్‌తో అనుసంధానం చేయకపోతే శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) పనిచేయదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. పాన్ మరియు ఆధార్‌లను...

మార్చి 31, 2020 నాటికి ఆధార్‌తో అనుసంధానం చేయకపోతే శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) పనిచేయదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. పాన్ మరియు ఆధార్‌లను అనుసంధానించడానికి గడువు చాలాసార్లు పొడిగించామని.. ప్రస్తుత గడువు 2020 మార్చి 31 తో ముగుస్తుందని తెలిపింది. 2020 జనవరి 27 వరకు 30.75 కోట్లకు పైగా పాన్లను ఇప్పటికే ఆధార్‌తో అనుసంధానించారు. అయితే, 17.58 కోట్ల పాన్లను ఆధార్ ఐడితో అనుసంధానించలేదు. "జూలై 1, 2017 నాటికి శాశ్వత ఖాతా నంబర్‌ను పొందిన వారు సెక్షన్ 139AA లోని సబ్-సెక్షన్ (2) కింద తన ఆధార్ నంబర్‌ను లింక్ చేసుకోవాలి, మార్చి 31, 2020 ఆధార్ లింకింగ్ చెయ్యకపోతే, అటువంటి వ్యక్తి యొక్క శాశ్వత ఖాతా సంఖ్య చట్టం ప్రకారం పరిగణించబడదు,"అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) తెలిపింది.

మరోవైపు నోటిఫికేషన్ ద్వారా, CBDT ఆదాయపు పన్ను నియమాలను సవరించి అందులో 114AAA నియమాన్ని చొప్పించింది, అలాగే మార్చి 31, 2020 తరువాత పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించేవారికి, ఐటి విభాగం "ఆధార్ నంబర్‌ను తెలియజేసిన తేదీ నుండి అమలులోకి వస్తుంది" అని తెలిపింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 AA (2) ప్రకారం, జూలై 1, 2017 నాటికి పాన్ ఉన్న, మరియు ఆధార్ పొందటానికి అర్హత ఉన్న ప్రతి వ్యక్తి తన ఆధార్ నంబర్‌ను పన్ను అధికారులకు తెలియజేయాలని సూచించింది. కాగా సుప్రీంకోర్టు 2018 సెప్టెంబర్‌లో ఆధార్‌ను రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అయ్యేదిగా ప్రకటించింది.. అలాగే ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి మరియు పాన్ కార్డుల కేటాయింపునకు బయోమెట్రిక్ ఐడి తప్పనిసరి అని పేర్కొంది.

ఇదిలావుంటే పాన్ తో ఆధార్ కార్డు లింకింగ్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా చేయాలి.. ముందుగా www.incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌కి వెళ్ళాలి.. ఆ పేజ్‌లో ఎడమ వైపు ఉన్న క్విక్ లింక్స్‌లోని 'లింక్ ఆధార్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.. ఆ తరువాత ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ పైభాగంలో 'క్లిక్ హియర్ టు వ్యూ ద స్టేటస్..' అనే హైపర్ లింక్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి.. తర్వాతి పేజ్‌లో మీరు మీ పాన్, ఆధార్ వివరాలు ఎంటర్ చేయాల్సి వస్తుంది. మీ వివరాలు ఎంటర్ చేసిన తర్వాత 'వ్యూ లింక్ ఆధార్ స్టేటస్'పై క్లిక్ చేయాలి.. దీంతో మీ ఆధార్, పాన్ లింక్ అయ్యాయో లేదో తెలుస్తుంది. మీ పాన్ నెంబర్ ఆధార్‌తో లింక్ అయ్యి ఉంటే పేజ్‌లో 'మీ పాన్ ఆధార్‌తో లింక్ అయ్యింది' అని సూచిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories