మోదీ కోసమే బాంబర్ జాకెట్ ...పాక్ సింగర్.. కౌంటర్ ఇచ్చిన భారత నెటిజన్లు


పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ సింగర్ కూడా పదేపదే భారత్ పై ప్రధాని మోదీపై విమర్శలు చేస్తుంది
జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తిగల ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ పై పాక్ ప్రతిక్షణం విషం చిమ్మడంమే పనిగా పెట్టకుంది. భారత గగనతంలంతోకి డ్రోన్లు పంపి పదే పదే కవ్వింపు చర్యలకు దిగుతోంది. పాకిస్థాన్ సైనికులు భారత సైన్యంపై ఉల్లంఘనకు పాల్పడి కాల్పులు జరుపుతోంది. అంతే కాకుండా ఆదేశానికి చెందిన యూనియన్ మినిష్టర్ కూడా భారత్ తో అణు యుద్దం చేస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇప్పుడు పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ సింగర్ కూడా పదేపదే భారత్ పై ప్రధాని మోదీపై విమర్శలు చేస్తుంది. గతంలో రబ్బీ పిర్జాదా పామును పట్టకుని మోదీపైకి పాముని వదులుతా అన్న విషయం తెలిసిందే. తాజాగా పాక్ గాయని రబ్బీ పిర్జాదా సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదాస్పదమైంది. భారత ప్రధాని మోదీపై అవమానకరకమైన పోస్ట్ పెట్టింది. అసభ్య పదజాలాన్ని వాడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఆత్మాహుతి బాంబర్ జాకెట్ వేసుకొని మోదీ కోసమే జాకెట్ ధరించాని ట్వీట్ చేసింది. ప్రధాని మోదీని హిట్లర్‌తో పోల్చింది. సింగర్ చేసిన వ్యాఖ్యలపై భారత్ నెటిజన్లు ఆమె కౌంటర్ల్లు ఇచ్చారు. మోదీని టార్గెట్ చేస్తే తోలు తీసాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇది మీ పాక్ యూనిఫామా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
اخر کار کشمیری بہن بھائی کیساتھ ایک یہی راستہ ہوگا ۔جب اقوامی متحدہ ثالثی میں فیل ہوگا۔ pic.twitter.com/ZnHQj35HE3
— Rabi Pirzada Bodyguard (@FunRabi) October 21, 2019

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



