Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో మృత్యు ఘంటికలు

Oxygen Shortage to covid Patients In Uttarpradesh
x

కారులో ఆక్సిజన్ అందిస్తున్న యూవకుడు (ఫైల్ ఇమేజ్)

Highlights

Uttar Pradesh: ప్రత్యక్ష నరకం చూస్తున్నారు కోవిడ్ బాధితులు * కారులో ఉంచి ఆక్సిజన్‌ అందిస్తున్న కుటుంబీకులు

Uttar Pradesh: కూతురు చున్నీనే ఆ తండ్రికి నీడ అవుతోంది. కారులోని సీటే ఐసీయూ బెడ్ గా మారింది. ఇది ఉత్తరప్రదేశ్‌లో కరోనా పేషెంట్ల పరిస్థితి. ఆక్సిజన్ దొరికితే ఆస్పత్రిలో బెడ్ దొరకడం లేదు బెడ్ దొరికితే ఆక్సిజన్ దొరకడం లేదు. దాంతో వరండలో ఉండే కూర్చిలే బెడ్స్ అవుతున్నాయి. కారులోని సీటు ఐసీయూ రూం అవుతోంది. ఇలా ఉన్న వారందరూ దాదాపు చావుకు దగ్గరగా ఉన్నవారే ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నా వారే కానీ, వారిని చూసే నాథుడు లేకుండా పోయాడు. కరోనా చావు భయం ఎలా ఉంటుందో ఈ దృశ్యలు కళ్లకు ప్రత్యక్షంగా కనబడుతోంది.

ఇక్కడ మీరు చూస్తున్నది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇందిరాపురం గురుద్వార్‌ స్టార్స్ ఆక్సిజన్ సెంటర్. ఇక్కడ ఉన్న అన్ని బెడ్స్ కొవిడ్ పేషెంట్‌లతో నిండాయి. అయితే బెడ్స్ లేవు అని తెలిసినా జనాలు మాత్రం వస్తూనే ఉన్నారు. ఆక్సిజన్ సీలిండర్ దొరికితే అక్కడే ఎక్కించుకుంటున్నారు. ఎండను సైతం కూడా పట్టించుకోకుండా తమ వారి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ ప్రాణాలతో రిస్క్ చేస్తున్నారు.

దేశంలో రోజుకు మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఒక పక్కన వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా పాజిటివ్ కేసులు మాత్రం ఆగడం లేదు అదే సమయంలో ఆక్సిజన్ కోసం దేశం అల్లాడిపోతుంది. హృదయ విదాకర దృశ్యాలు కళ్లకు కడుతున్నాయి. ఇది ఒక్క యూపీలో సీన్ మాత్రమే దేశంలోని ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఆక్సిజన్‌ లేక బాధితుల ఊపిరి ఆగిపోతోంది. అవసరమైన ఆక్సిజన్లు అందించాలని కేంద్రాన్ని రాష్ట్రాలు కోరుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories