Kota: శివరాత్రి వేడుకల్లో అపశృతి.. కరెంట్ షాక్ కి గురైన 17 మంది చిన్నారులు

Over 17 Children Suffer Electric Shock During Mahashivratri Celebrations In kota
x

Kota: శివరాత్రి వేడుకల్లో అపశృతి.. కరెంట్ షాక్ కి గురైన 17 మంది చిన్నారులు

Highlights

Kota: రాజస్థాన్‌ కోటాలోని కాలీబస్తీలో ఘటన

Kota: శివరాత్రి వేడుకల సందర్భంగా రాజస్థాన్‌ కోటాలోని కాలీబస్తీలో అపశృతి చోటు చేసుకుంది. శివరాత్రి పూజల్లో పాల్గొంటున్న పిల్లలపై కరెంటు వైర్లు పడటంతో ఏకంగా 17 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. వీరిని మెరుగైన చికిత్స కోసం జైపూర్‌కు తరలించేందు డాక్టర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.

కాలీ బస్తీ ప్రాంతంలో ఉదయం 11 గంటలకు శివరాత్రి సందర్భంగా భారీ ఊరేగింపు జరుగుతోంది. ఈ సమయంలో పెద్దలతో పాటు చిన్నారులు కూడా ఈ ఊరేగింపు కోసం ఎక్కువగా తరలివచ్చారు. ఓ గుడి నుంచి కలశం తెచ్చేందుకు మరో గుడి వద్దకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఊరేగింపులో పాల్గొంటున్న చిన్నారులు ఓ పొడవైన ఐరన్ రాడ్ కు జెండాలు తగిలించి తీసుకెళ్తున్నారు. ఈ రాడ్ కాస్తా హైటెన్షన్ వైర్ కు తాకడంతో చిన్నారులు విద్యుత్ షాక్ కు గురయ్యారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యుత్ షాక్ గురైన చిన్నారులు అంతా 9 నుంచి 16 ఏళ్లలోపు వారే ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories