Parliament: పార్లమెంట్‌ ఎదుట విపక్షాల ఎంపీల నిరసన

Opposition MPs protest in front of Parliament
x

Parliament: పార్లమెంట్‌ ఎదుట విపక్షాల ఎంపీల నిరసన

Highlights

Parliament: ఈ సెషన్‌ పార్లమెంట్‌ సమావేశాలకు.. 13 మంది ఎంపీలను సస్పెండ్‌ చేసిన స్పీకర్

Parliament: పార్లమెంట్లో అనుచితంగా ప్రవర్తించినందుకు 14 మంది ఎంపీలు సస్పెన్షన్‌కి గురయ్యారు. ఒక రాజ్యసభ ఎంపీతో పాటు 13 మంది లోక్‌సభ ఎంపీలపై పార్లమెంట్ చర్యలు తీసుకుంది. లోక్‌సభలో భద్రతా ఉల్లంఘన ఘటనపై విపక్షాల ఆందోళనతో నిన్న పార్లమెంట్‌ ఉభయసభలు దద్దరిల్లాయి. స్మోక్‌ అటాక్‌ ఘటనపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌ షా వివరణ ఇవ్వాలంటూ విపక్ష ఎంపీలు పట్టుబడ్డారు. విపక్ష ఎంపీల ఆందోళనలతో లోక్‌సభ, రాజ్యసభ పలు మార్లు వాయిదా పడ్డాయి. దీంతో ఆందోళన చేపట్టిన ఎంపీలను ఈ శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. స్పీకర్‌ నిర్ణయంపై సస్పెండ్‌ అయిన ఎంపీలు పార్లమెంట్‌ ఎదుట నిరసన తెలిపారు. వారికి విపక్ష ఎంపీ మద్దతు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories